Operation Mahadev : ఆపరేషన్ మహదేవ్లో హతమయ్యింది ముమ్మాటికీ పాక్ ఉగ్రవాదులే
లోక్‌సభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చలో స్పష్టం చేసిన హోంమంత్రి అమిత్‌షా

ఆపరేషన్ మహదేవ్ లో భాగంగా పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు పాక్ ఉగ్రవాదులను భారత సైనిక దళాలు మట్టుపెట్టాయని హోంమంత్రి అమిత్ షా మంగళవారం లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సింధూర్ పై రెండో రోజు జరిగిన చర్చలో హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ సరిహద్దులో ఉన్న హిందూ ఆలయాలు, సామాన్యులను టార్గెట్ చేసి పాక్ రెచ్చిపోయిందని వెల్లడించారు. పహల్గామ్‌లో కుటుంబసభ్యుల ముందే భారత పర్యాటకులను కాల్చి చంపేశారని, దాడి అనంతరం టెర్రరిస్టులు పాకిస్తాన్ దేశం వెళ్లేందుకు ప్రయత్నించారని అమిత్ షా సభ దృష్టికి తీసుకువచ్చారు. అయితే మన భద్రతా దళాలు ఉగ్రవాదులు సరిహద్దు దాటే అవకాశం ఇవ్వలేదని అమిత్ షా సభకు తెలిపారు. నిన్న సోమారం జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఆపరేషన్ మహదేవ్ గురించి అమిత్‌షా లోక్‌సభకు వివరించారు. ఆపరేషన్ మహాదేవ్‌లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతమయ్యారని, వారిలో ఒకరిని ఎల్‌ఈటీ ఉగ్రవాది సులేమాన్ మూసాగా గుర్తించామని హోంమంత్రి వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడిలో సులేమాన్ కీలక సూత్రధారి అని అమిత్‌షా చెప్పారు. ఆపరేషన్ మహదేవ్ లో భద్రతాదళాలు మట్టుపెట్టిన వాళ్ళు పాక్ ఉగ్రవాదులనడానికి ప్రూఫ్ ఏంటని చిదంబరం అడుగుతున్నారని, వారు ముగ్గురు పాకిస్తాన్‌కి చెందినవారే అని హోంమత్రి స్పష్టం చేశారు. ఉగ్రవాదుల దగ్గర పాకిస్తాన్‌లో తయారైన చాక్లెట్లు, ఓటర్ వివరాలు లభ్యమైనట్లు అమిత్‌షా తెలిపారు. చిదంబరం పాకిస్తాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని హోంమంత్రి అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రవాదులను హతమరిస్తే విపక్షాలు సంతోషిస్తాయని అనుకున్నా అని కానీ వారిని చూస్తుంటే సంతోషంగా లేనట్లు కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కమ్యూనికేషన్ డివైజ్‌ను ట్రాక్ చేయడం ద్వారా ఉగ్రవాదుల అనుపానులు పసిగట్టామని, సీఆర్‌పీఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీసులు, పారా మిలటరీలు కలసి ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసినట్లు అమిత్‌షా పేర్కొన్నా
