Major Setback for the Party AIADMK: ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామా.. AIADMKకు మరో భారీ ఎదురుదెబ్బ
AIADMKకు మరో భారీ ఎదురుదెబ్బ

Major Setback for the Party AIADMK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అన్నాడీఎంకే (AIADMK) పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సోమవారం ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.
మరగతం కుమారవేల్, జయకుమార్, సత్యభామలు తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు సమర్పించారు. రాజీనామా చేసిన వెంటనే వీరు టీవీకే (TVK) మంత్రి ఆదవ్ అర్జున్‌ను కలిశారు.
ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బలపరీక్ష సందర్భంగా టీవీకే ప్రభుత్వానికి సీవీ షణ్ముగం నేతృత్వంలోని 20 మందికి పైగా అన్నాడీఎంకే అసమ్మతి ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. వారిలో ఈ ముగ్గురు కూడా ఉన్నారు.
ఈ రాజీనామాలతో...
మదురాంతకం
ధారాపురం
పెరుందురై
నియోజకవర్గాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఈ మూడు స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 47 సీట్లు మాత్రమే గెలుచుకుంది. వరుసగా రెండోసారి అధికారం చేజారడంతో పార్టీలో అసంతృప్తి పెరిగింది. అక్టర్ విజయ్‌కు మద్దతు ఇవ్వాలా వద్దా అన్న విషయంలో పార్టీ రెండుగా చీలింది.
ఈ రాజీనామాలు AIADMKకు మరో భారీ షాక్‌గా మారాయి.

