Ukasa Orders, Umar Executes: ఉకాసా ఆర్డర్లు.. ఉమర్ అమలు: ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో కొత్త వెలుగులు
ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో కొత్త వెలుగులు

ఫరీదాబాద్‌లోని ఉగ్రవాద మాడ్యూల్‌కు విదేశీ కనెక్షన్లపై భద్రతా సంస్థలు దర్యాప్తును వేగవంతం చేశాయి. ఈ క్రమంలో తాజాగా ఒక ముఖ్య సమాచారం తలెత్తింది. తుర్కీలో ఆధారిత 'ఉకాసా' అనే హ్యాండ్లర్‌తో ఈ మాడ్యూల్‌కు సంబంధాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ధృవీకరించాయి. ఈ విషయంపై వివిధ మీడియా రిపోర్టులు ప్రచురితమవుతున్నాయి.
'ఉకాసా' అంటే అరబిక్‌లో 'స్పైడర్' అని అర్థం. ఫరీదాబాద్ గ్రూప్, జైష్-ఇ-మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలతో పాటు అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్‌లోని నాయకులకు ఈ ఉకాసాతో ప్రత్యక్ష లింకులు ఉన్నట్లు సమాచారం. ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా డాక్టర్ ఉమర్ మరియు అతని సహచరులు ఈ హ్యాండ్లర్‌తో సంప్రదించినట్లు రహస్య సంస్థలు గుర్తించాయి. 2022లో డాక్టర్ ఉమర్ (డాక్టర్ ఉమర్ ఉన్ నబీ)తో పాటు ఇతరులు తుర్కీని సందర్శించారని అధికారులు ఇంతకుముందే తెలుసుకున్నారు. అంకారాలో వారు రెండు వారాలు కన్నా ఎక్కువ సమయం గడిపినట్లు కూడా తేలింది. దీంతో ఉకాసా కూడా అక్కడే ఉండి, ఈ టీమ్‌ను నిర్దేశిస్తూ డబ్బులు కూడా సరఫరా చేసినట్లు అనుమానం. భారత్‌లో బెస్ట్ పేలుళ్లకు ఈ మాడ్యూల్ రూపొందించిన ప్లాన్‌లో ఉకాసా ప్రధాన పాత్ర పోషించినట్లు గుర్తించారు.
హ్యాండ్లర్లతో మాట్లాడేటప్పుడు ఇంటెలిజెన్స్ టీమ్‌లకు తెలియకుండా ఉండేందుకు ఈ గ్రూప్ ప్రత్యేక జాగ్రత్తలు పాటించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెట్‌వర్క్ వెనుక ఒక విదేశీ యూనిట్ పనిచేస్తోందని స్పష్టంగా తెలుస్తోందని ఒక సీనియర్ అధికారి చెప్పారు. ఈ కుట్రల వివరాలను పూర్తిగా తెలుసుకోవడానికి నిందితుల చాట్ రికార్డులు, కాల్ హిస్టరీలను టీమ్‌లు విశ్లేషిస్తున్నారు. ఉకాసాను గుర్తించడంతో పాటు అతనికి పాకిస్తాన్ ఉగ్రవాద నాయకులతో ఉన్న బంధాల గురించి తెలుసుకోవడానికి విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సహకారం పొందే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
మరో వైద్యుడు అరెస్టు..
అంతేకాకుండా, ఫరీదాబాద్ మాడ్యూల్‌కు సంబంధించి మరో డాక్టర్‌ను భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన కార్డియాలజీ విద్యార్థి డాక్టర్ మహ్మద్ ఆరిఫ్‌ను కాన్పూర్‌లో పట్టుకున్నారు. ఇతనికి ఇటీవల అరెస్టయిన డాక్టర్ షాహిన్‌తో దగ్గరి సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఇద్దరూ క్రమం తప్పకుండా కాంటాక్ట్‌లో ఉండేవారని అధికారులు నిర్ధారించారు.

