ఉత్తరప్రదేశ్‌లో శారీరక, సామాజిక సంబంధాలను ప్రశ్నార్థకం చేసే ఘటనలు వరుసగా కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల అలీగఢ్‌లో ఓ తల్లి తన కూతురికి కాబోయే అల్లుడితో పారిపోగా, తాజాగా రాంపూర్ జిల్లాలో ఓ మామ తన కుమారుడికి నిశ్చయించిన కోడలిని తానే పెళ్లి చేసుకుని పరారయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే, రాంపూర్‌కు చెందిన షకీల్ అనే వ్యక్తి తన కుమారుడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహం చేసేందుకు నిశ్చయించాడు. అయితే, పెళ్లి ఫిక్స్ అయిన నాటి నుంచే షకీల్ తన కాబోయే కోడలితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ సంబంధాన్ని మరింత దగ్గరగా మార్చుకున్నాడు. ఇది చివరకు శారీరక సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న కుమారుడు ఆ వివాహానికి నిరాకరించడంతో పరిస్థితి మలుపు తిరిగింది.

షకీల్‌ భార్య షబానా కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో, షకీల్ ఆమెను, తన కుమారుడిని కొట్టి మరీ.. తనకు నిశ్చయమైన కోడలినే వివాహం చేసుకున్నాడు. అంతే కాకుండా, పెళ్లి కోసం ఉంచిన నగదు, నగలు తీసుకుని ఆమెతో కలిసి ఉడాయించాడు.

ఇలాంటి సంఘటనే రెండు నెలల క్రితం అలీగఢ్‌లో చోటుచేసుకుంది. అక్కడ అనిత అనే మహిళ, తన కుమార్తె శివానీకి నిశ్చయించిన అల్లుడితో ప్రేమలో పడి, రూ.3.5 లక్షల నగదు, బంగారంతో కలిసి అతనితో పారిపోయింది. ఇలాంటి ఘటనలు స్థానికంగా మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇలాంటి పరిణామాలు కుటుంబ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తతున్నాయి. అసాధారణమైన ఆచరణలు మానవ సంబంధాల విలువను ప్రశ్నించే స్థితికి తీసుకువస్తున్నాయి.


Politent News Web4

Politent News Web4

Next Story