Union Minister Ashwini Vaishnaw: మోదీ ‘స్వదేశీ’ నినాదం ప్రభావం.. జోహో సేవలు ఎంచుకున్న కేంద్ర మంత్రి
జోహో సేవలు ఎంచుకున్న కేంద్ర మంత్రి

Union Minister Ashwini Vaishnaw: ప్రధాని నరేంద్ర మోదీ ‘స్వదేశీ’ పిలుపునిచ్చిన నేపథ్యంలో, భారతీయులు స్వదేశీ ఉత్పత్తులు, సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ పిలుపుకు స్పందిస్తూ, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మైక్రోసాఫ్ట్‌కు ప్రత్యామ్నాయంగా స్వదేశీ ప్లాట్‌ఫామ్ అయిన జోహోకు మారుతున్నట్లు ప్రకటించారు. ఇకపై తాను జోహో సేవలను మాత్రమే ఉపయోగిస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికపై ఒక పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ పిలుపును అందరూ ఆచరించాలని, స్వదేశీ ఉత్పత్తులు, సేవలను వినియోగించాలని ఆయన ప్రజలను కోరారు.
జోహో గురించి
జోహో కంపెనీని 1996లో శ్రీధర్ వెంబు, టోనీ థామస్ స్థాపించారు. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ఇది సాఫ్ట్‌వేర్ ఆజ్ ఏ సర్వీస్ (SaaS) కంపెనీగా పనిచేస్తూ, 55 రకాల క్లౌడ్ ఆధారిత బిజినెస్ టూల్స్‌ను అందిస్తోంది. ఈ-మెయిల్, అకౌంటింగ్, హెచ్‌ఆర్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, సీఆర్ఎమ్ వంటి విభిన్న సేవలు ఇందులో భాగంగా ఉన్నాయి. అమెరికాతో సంబంధాలు ఉన్నప్పటికీ, జోహో ఒక ‘మేడ్ ఇన్ ఇండియా’ కంపెనీగా, తమిళనాడు నుంచి ప్రధాన కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
జోహో సేవలు 150 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి మరియు 100 మిలియన్ల మంది కస్టమర్లను కలిగి ఉంది. స్టార్టప్‌ల నుంచి ఫార్చ్యూన్ 500 కంపెనీల వరకు దీని కస్టమర్లుగా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365, గూగుల్ వర్క్‌స్పేస్‌లకు పోటీగా జోహో రైటర్, జోహో షీట్, జోహో షో, జోహో నోట్‌బుక్, జోహో వర్క్ డ్రైవ్, జోహో మెయిల్, జోహో మీటింగ్, జోహో కాలెండర్ వంటి సేవలను అందిస్తోంది.
