Stalin’s Sensational Remarks: తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితి ఉందని డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలు ముందస్తు ఎన్నికలకు సన్నాహాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

డీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ, "ఈ ఓటమి తాత్కాలికం మాత్రమే. ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు. 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి" అని అన్నారు. ఆ ఎన్నికల్లో డీఎంకే తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో డీఎంకే సూర్యుడు ఎప్పటికీ అస్తమించదని ఆయన పేర్కొన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత స్వీకరించిన స్టాలిన్, ఓటమి కారణాలను విశ్లేషించి ప్రజల అభిప్రాయాలు సేకరించేందుకు 36 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీలో అన్ని స్థాయిల్లో మార్పులు తీసుకురావాలని, గ్రాస్ రూట్ స్థాయిలో బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.

ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. విజయ్ ప్రభుత్వం స్థిరత్వం, డీఎంకే వ్యూహాలపై రాజకీయ విశ్లేషకులు దృష్టి సారించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story