కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు కార్డులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 15 రోజుల్లోనే ఓటరు కార్డు జారీ చేసేలా నిబంధనల్లో మార్పులు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నిర్ణయంతో ప్రజలు ఓటర్ కార్డు తీసుకోవడం సులభతరం అవుతోంది. కొత్త ఓటరు దరఖాస్తులతో పాటు పాత వాటిలో మార్పులు కూడా ఓటర్ల జాబితా పూర్తయిన 15 రోజుల్లోనే ఇస్తామని తెలిపింది. దీని కోసమే తమ ఐటీ మాడ్యూల్‌లో కీలక మార్పులు చేశామని పేర్కొంది.

దీంతో దేశ వ్యాప్తంగా అనేక మందికి లబ్ది చూకూరనుంది. నెలల తరబడి వేచి చూసే కష్టాలు ప్రజలకు తప్పాయి. అదే సమయంలో తప్పుడు ఓటర్ల నమోదుకు చేసే యత్నాలను అడ్డుకునేందుకు కట్టదిట్టమైన చర్యలు తీసుకోవల్సిన అవశ్యకత ఉంది.

Next Story