ఎన్‌ఐఏ విచారణలో వెల్లడించిన తహవ్వుర్‌ రాణా

నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ ముంబయ్‌ పేలుళ్ళ కుట్రదారు తహవ్వుర్‌ రాణా నుంచి కీలక సమాచారం రాబట్టింది. అమెరికా తహవ్వుర్‌ రాణాను భారత్‌ కు అప్పగించిన తరువాత అతను ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నాడు. ఎన్‌ఐఏ విచారిస్తున్న క్రమంలో రాణా అనేక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా తాను పాకిస్తాన్‌ ఆర్మీకి తాను అత్యంత నమ్మకమైన ఏజెంట్‌ గా పనిచేసినట్లు ముంబయ్‌ పేలుళ్ళ కుట్రదారుడు తహవ్వుర్‌ రాణా విచారణ అధికారుల ముందు అంగీకరించినట్లు సమాచారం. ముంబయ్‌ ఉగ్రదాడుల్లో తన ప్రమేయం ఉన్నట్లు తహవ్వుర్‌ రాణా అంగీకరించినట్లు అధికారవర్గాల నుంచి సమాచారం అందుతోంది. ముంబయ్‌ పేలుళ్ళ సమయంలో తాను అదే నగరంలో ఉన్నట్లు రాణా ఎన్‌ఐఏ దగ్గర ఒప్పుకున్నట్లు తెలిసింది. అలాగే గల్ఫ్‌ యుద్దం సమయంలో కూడా పాకిస్తాన్‌ ఆర్మీ తనను సౌదీ అరేబియాకు పంపినట్లు తహవ్వూర్‌ రాణా విచారణ అధికారులకు తెలిపాడు. తన స్నేహితుడు హెడ్లీతో పాటు పాకిస్తాన్‌ లో ని లష్కరే తోయిబా ఉగ్రవాద శిక్షణా శిమిరంలో శిక్షణ పొందినట్లు కూడా తాహావూర్‌ అంగీకరించాడు. పాక్‌ ఉగ్రవాదుల ప్రణాళికలో భాగంగా తన సంస్ధకు చెందిన ఇమ్మిగ్రేషన్‌ సెంటర్‌ ను ముంబయ్‌ లో ప్రారంభించడానికి తాను ముంబయ్‌ వచ్చినట్లు ఎన్‌ఐఏకి తెలిపాడు. ఆ సందర్భలోనే అనేక ఆర్థిక లావాదేవీలు చేయడమే కాకుండా ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మినస్‌ తోపాటు అనే ప్రాంతాలను పరిశీలించినట్లు తహవుర్‌ తెలిపాడు. ముంబయ్‌ దాడుల్లో పాకిస్తన్‌ కు చెందిన ఐఎస్‌ఐ సహకారం కూడా ఉందని తహవ్వుర్‌ రాణా ఎన్‌ఐఏకు చెప్పినట్లు సమాచారం.

Politent News Web 1

Politent News Web 1

Next Story