ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Parents Must Know: సోషల్ మీడియాతో జాగ్రత్త. ముక్కు మోహం తెలియని వారితో పరిచయం మరీ ప్రమాదకరం..ఫేస్ బుక్, ఇన్ స్టా పరిచయాలు కొన్ని సార్లు ప్రేమకు దారి తీస్తాయి. అది ఎన్ని అనర్ధాలకు మూలం అవుతుందో చెప్పడానికి ఎన్నో ఘటనలు కళ్లముందు ఉన్నాయి. అందుకే పేరెంట్స్ మీ పిల్లలు ఆన్ లైన్ లో ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టండి. మీ పిల్లలపై కేర్ తీసుకోండి.

జాగ్రత్తలు

ఆన్లైన్ అపరిచితులతో స్నేహం చేయకండి. ఒకవేళ ఫ్రెండ్ రిక్వెస్టులు వస్తే.. అస్సలు యాక్సెప్ట్ చేయకండి.

ఒకవేళ చేసినా.. చాటింగ్, వీడియో కాలింగ్ వంటి వాటి జోలికి అస్సలు వెళ్లకండి.

ఆన్లైన్ యాప్స్, సోషల్ మీడియాలో పరిచయమైన వారిని నేరుగా కలవడానికి వెళ్లకండి.

ఒకవేళ కలిసినా... జనాలు తిరిగే చోట, సీసీ కెమెరాలు ఉన్న చోట మాత్రమే కలవండి. అప్పుడే వారు మీ మీద దాడి చేయడానికి సాహసించరు.

సైబర్ నేరగాళ్లు చనువుగా మాట్లాడుతూ.. వ్యక్తిగత వివరాలు సేకరిస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో అపరిచితులకు మన వ్యక్తిగత వివరాలు, నివాస వివరాలు ఇవ్వకూడదు.

స్నేహితులతో సోషల్ మీడియా యాప్స్ పంచుకున్నప్పటికీ హద్దుల్లో ఉండటమే బెటర్.

పర్సనల్ ఫొటోలు సోషల్ మీడియాలో అస్సలు పెట్టెద్దు. ఒకవేళ మార్పింగ్ గురైతే బాధపడాల్సి వస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story