Chandrababu Naidu is trying to turn Telangana into a desert

..మాజీమంత్రి,ఎమ్మెల్యే జి . జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ @ తెలంగాణ భవన్
చంద్రబాబు నాయుడు గోదావరి నీళ్లను తరలించే కుట్ర చేస్తున్నారని మాజీమంత్రి,ఎమ్మెల్యే జి . జగదీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణను ఎడారిగా మార్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు
చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఈ రోజు మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి..గోదావరి,బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా లేదన్నారు.
జగదీష్ రెడ్డి ్రపెస్ మీట్ ముఖ్యాంశాలు
క్రిష్ణా నది నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. గోదావరి విషయంలోను తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. గోదావరి,బనకచర్లపై క్యాబినెట్ లో సీరియస్ చర్చ జరగలేదు.
గోదావరి,బనకచర్లపై అన్ని పార్టీలు తెలంగాణలో ఏకం కావాలి. చంద్రబాబునాయుడును చర్చలకు పిలవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పనికిమాలిన చర్య. అపెక్స్ కౌన్సిల్ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. చంద్రబాబు నాయుడుతో చర్చలు చేస్తే తెలంగాణకు నష్టం జరుగుతుంది.
ఒక వర్గం మీడియా పథకం ప్రకారం తెలంగాణలో రాజకీయ పార్టీల పంచాయతీగా గోదావరి జలాల అంశాన్ని చూపెడుతోంది. గోదావరి నదీ జలాలు తెలంగాణ బ్రతుకుదెరువు అంశం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు సరైన మార్గంలో లేవు. గోదావరి, కావేరి లింక్ అని చంద్రబాబు నాయుడు చెప్పడం పెద్ద మోసం.
గోదావరి,కావేరి లింక్ పై ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం ఎప్పుడో అభ్యంతరం చెప్పింది. చంద్రబాబునాయుడు మాయలో మనం పడవద్దు. బీజేపీ ఎంపీలు,కేంద్ర మంత్రులు గోదావరి జలాల అంశంపై అవగాహన పెంచుకోవాలి. త్వరలోనే గోదావరి ట్రిబ్యునల్ వచ్చే అవకాశం ఉంది. ట్రిబ్యునల్ రాకముందే 200 టీఎంసీలకు హక్కు కల్పించుకోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
తెలంగాణ ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారు. గోదావరి మిగులు జలాలు వాడుకోవాలంటే క్రిష్ణానది ద్వారా తెలంగాణకు గోదావరి జలాలు రావాలని కేసీఆర్ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలకు గోదావరి మిగులు జలాలు ఏ విధంగా ఉపయోగం అవుతాయో కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణకు నీళ్లు దొరకుండా 80వేల కోట్లతో చంద్రబాబు నాయుడు నీళ్లను తీసుకువెళ్తున్నారు. మోదీకి చంద్రబాబునాయుడు ఊపిరిగా మారారు.
చంద్రబాబునాయుడు అవసరం బీజేపీకి ఉంది. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓట్లు వేయలేదా...? పిలవాల్సింది అపెక్స్ కౌన్సిల్ ను చంద్రబాబు నాయుడును కాదు. చంద్రబాబునాయుడును
చర్చలకు పిలవడం అంటే మీరు దాసోహం అన్నట్లే. ప్రభుత్వం కార్యాచరణ తీసుకొకపోతే ప్రజలను కలుపుకుని రాజకీయ పార్టీగా పోరాటం చేస్తాము. ప్రభుత్వం రైతు సంబురాలు ఎందుకు...? ఎవరికోసం...? సంబురాలు చేసుకోవడానికి రైతులు సంతోషంగా ఉన్నారా...?
2014కు ముందు పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. రైతు సంబురాలు చేసుకోవడానికి ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదా. రైతులు అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క,ఉత్తమ్ కుమార్ రెడ్డి,సీఎం రేవంత్ రెడ్డి సోదరులకు సహాయం చేయడమా...? మూడేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తామని పొంగులేటి అనడం హాస్యాస్పదం.
సూర్యాపేటలో రప్పా,రప్పా ఫ్లెక్సీలు నా దృష్టికి రాలేదు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాజకీయ ఘర్షణలు రాష్ట్రంలో లేవు. రాజకీయ దాడులు అనేవి ఏపీలో ఉన్న రేవంత్ రెడ్డి మిత్రుల పని
ఏపీలో ఉన్న దాడుల సంస్కృతిని తెలంగాణకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
