సింగపూర్ దేశ అధ్యక్షుడు, మాజీ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ-సింగపూర్ మధ్య భాగస్వామ్యంపై చర్చ

సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దేశ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, మాజీ ప్రధాని, ప్రస్తుత సీనియర్ మంత్రి లీ సైన్ లూంగ్ తో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఏపీ సింగపూర్ ప్రభుత్వాలు కలిసి వివిధ రంగాల్లో పనిచేసే అంశంపై చర్చించారు. ఈ పర్యటనతో ఏపీలోని వివిధ రంగాల్లో సింగపూర్ తో కలిసి పనిచేసేలా కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టు అయ్యిందని ఆ దేశ అధ్యక్షుడు షణ్ముగ రత్నంతో ముఖ్యమంత్రి చెప్పారు. నాలెడ్జి ఎకానమీ, మౌలిక సదుపాయాల కల్పన , సెమికండక్టర్లు, అమరావతి అభివృద్ధి , అర్బన్ ప్లానింగ్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యంతో ముందుకు వెళ్లే అంశాలపై ఇరువురు నేతలతో ముఖ్యమంత్రి చర్చించారు. ఇక సింగపూర్ మాజీ ప్రధాని, ప్రస్తుత సీనియర్ మంత్రి లీ సైన్ లూంగ్ తో సమావేశమైన సీఎం చంద్రబాబు.. భారత్ -సింగపూర్ ల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు తమ పర్యటన ఉపకరిస్తుందని అన్నారు.
