వరుసగా ఐదు రోజులు క్రిస్ మస్ హాలిడేస్

Christmas Holidays: తెలుగు రాష్ట్రాల్లో సెలవుల జాతర మొదలైంది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులను ప్రకటించాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఈ వారం పెద్ద ఊరట లభించనుంది. వీకెండ్ (శని, ఆదివారాలు) తో కలిపి ఐదు రోజుల పాటు వీరికి సెలవులు రానున్నాయి.ఐటీ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు డిసెంబర్ 24 నుంచి 28 వరకు వరుసగా ఐదు రోజులు సెలవులు లభించే అవకాశం ఉంది. 24న క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే సెలవులతో పాటు, ఆ తర్వాత వచ్చే శని, ఆదివారాలు తోడవడంతో ఐటీ కారిడార్లలో సందడి పెరగనుంది. చాలా కంపెనీలు ఇప్పటికే ఈ సెలవులను ఖరారు చేయడంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు తమ కుటుంబాలతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని డిసెంబర్ 25 (బుధవారం) క్రిస్మస్ సందర్భంగా, డిసెంబర్ 26 (గురువారం) బాక్సింగ్ డే సందర్భంగా జనరల్ హాలిడేస్ ప్రకటించింది. ఇక డిసెంబర్ 24న 'క్రిస్మస్ ఈవ్' సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. జనరల్ హాలిడే రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడతాయి. ఆప్షనల్ హాలిడే మాత్రం ఆయా సంస్థల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 25న జనరల్ హాలిడే ప్రకటించింది. ఇక డిసెంబర్ 24 , 26 తేదీలను ఆప్షనల్ హాలిడేస్‌గా పేర్కొంది. దీనివల్ల ఏపీలో విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు కనీసం మూడు రోజుల పాటు పండుగ వాతావరణం నెలకొంటుంది.

సాధారణంగా జనరల్ హాలిడేస్ ఉన్న రోజుల్లో అన్ని స్కూళ్లు, కాలేజీలు తప్పనిసరిగా సెలవు పాటిస్తాయి. అయితే ఆప్షనల్ హాలిడేస్ విషయంలో కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు పని చేసే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఈ వారంలో వరుసగా 3 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. వరుస సెలవుల నేపథ్యంలో బస్సులు, రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయే అవకాశం ఉండటంతో ప్రయాణికులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story