Financial assistance to the family of Agniveer soldier Murali Naik

ఆపరేషన్ సిందూర్ లో వీర మరణం పొందిన అగ్నివీర్ సైనికుడు మురళీ నాయక్. సత్యసాయి జిల్లా చెందిన మురళీ నాయక్ కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించి రూ. 25 లక్షలు ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు శనివారం ఉదయం మురళీ నాయక్ తల్లితండ్రులకి పవన్ కళ్యాణ్ పంపించిన రూ. 25 లక్షల చెక్కును తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కల్లి తండాకు వెళ్ళి అందచేశారు. ఈ కార్యక్రమంలో అహుడ ఛైర్మన్ టి.సి.వరుణ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, జనసేన పార్టీ నేతలు పత్తి చంద్రశేఖర్, కాయగూరల లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

Politent News Web3

Politent News Web3

Next Story