హరీశ్ రావుపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు

హరీశ్ రావు, సంతోష్ రావు లపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు.. వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారని కవిత అన్నారు. మొత్తం వాళ్లే చేశారు నాన్నా.. అంటూ కల్వకుంట్ల కవిత వారిరువురి మీదా తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
హరీష్ రావు టార్గెట్‌గా ఎమ్మెల్సీ కవిత ఈ రోజు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించి మరీ తీవ్ర విమర్శలు గుప్పించారు. 'రేపు కేటీఆర్‌కు ఇదే జరుగుతుంది.. కేసీఆర్‌కు ఇదే జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణించారు. రేవంత్ రెడ్డి కాళ్లు హరీష్ రావు పట్టుకున్నాకే ఈ కుట్రలు మొదలయ్యాయి. హరీష్ రావుకు పాల వ్యాపారం ఉండేది. అధికారం లోకి రాగానే హాస్టళ్లకు పాలు సరఫరా చేశారని ఆరోపణలున్నాయి. రూ. లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి అంటారు.. కానీ, హరీష్ రావు గురించి మాట్లాడరు.. కేసీఆర్‌ను మాత్రమే టార్గెట్ చేస్తారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ వచ్చిందంటే.. అందుకు కారణం హరీష్ రావు, సంతోష్ రావే.' అంటూ కవిత ఆరోపించారు.
'కేసీఆర్‌తో మొదటి నుంచి హరీష్ రావు లేరు. టీడీపీ నుంచి బయటకు వచ్చే సమయంలో కూడా.. ఎందుకు ఈ నిర్ణయం అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ షూటర్.. కేసీఆర్‌కు హరీష్ రావు కట్టప్ప లాగా అంటారు.. హరీష్ రావు ఒక దశలో తన పక్కన ఎమ్మెల్యేలను పెట్టుకోవాలని చూశారు. నా ప్రాణం పోయినా కేసీఆర్‌కు అన్యాయం జరగనివ్వను. నాపై ఇన్ని కుట్రలు, ఇన్ని అవమానాలు అవసరమా..? ఎన్నో జన్మల పుణ్యముంటే కేసీఆర్‌కు కూతురిగా పుట్టా.. కేసీఆర్‌ను, పార్టీని నేనెందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటా..? అధికారంలో ఉన్నా.. లేకున్నా.. నేను ఒకేలా ఉన్నా. అధికారంలో ఉన్నా.. నన్ను ప్రతిపక్ష ఎంపీ గానే చూశారు. ఆరడుగుల బుల్లెట్టే నన్ను గాయపరిచింది.' అంటూ కవిత తన ప్రెస్ మీట్ లో ఆద్యంతం హరీశ్ రావుని టార్గెట్ చేశారు..
