మంత్రి లోకేష్ సమక్షంలో టెజరాక్ట్, యూట్యూబ్ అకాడమీలతో ఎంఓయు

ఆంధ్రప్రదేశ్ లో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి రెండు ప్రధాన సంస్థలతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎపి ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్ షాంగ్రీలా హోటల్ లో జరిగిన కార్యక్రమంలో టెజారాక్ట్, US Inc. ప్రెసిడెంట్ తేజ ధర్మ, యూట్యూబ్ అకాడమీ ఇండియా హెడ్ అర్జున్ దొరైస్వామి, ఎపి ప్రభుత్వం ఐటి కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఎంఓయుపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సృజనాత్మక కంటెంట్ తయారీ కోసం ఎపి ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేస్తుంది. పాఠ్యాంశాలు, శిక్షణా కార్యక్రమాలకు గూగుల్ సంస్థ వనరులు, సాంకేతికత, నైపుణ్యాలను అందించనుండగా, టెజారాక్ట్ సంస్థ ఫిజికల్ సెటప్, నిర్వహణ, రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. డిజిటల్ కంటెంట్ పరిశ్రమలో విజయం సాధించేందుకు ఔత్సాహిక సృష్టికర్తలను సన్నద్దం చేయడం, వారికి అవసరమైన స్కిల్స్, నాలెడ్జి, వనరులు సమకూర్చడం ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించడమే ఒప్పందం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story