ఆషాడ మాసంలో జరిగే బోనాల ఉత్సవాలపై ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నతాధికారుల సమీక్ష జరిగింది. తెలంగాణ ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆషాఢ జాతర బోనాల ఉత్సవాలు 2025 జరగనున్నాయి. అధికారుల సమన్వయ సమావేశానికి హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, డిజిపి జితెందర్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఎండోమెంట్, మూడు కమిషనరెట్ల సీపీ లు, డీసీపీ లు, పోలీస్ , ఎండోన్మెంట్ అన్ని విభాగాల అధికారులు హజరయ్యారు. ఈ నెల 26 నుంచి నెల రోజుల పాటు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. గోల్కొండ బోనాలు ప్రారంభం మొదటి పూజ జూన్ 26, జూలై ఒకటో తేదీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, సికింద్రాబాద్ బోనాలు... (లష్కర్ బోనాలు) జూలై 13 వ తేదీ బోనాలు, జూలై 14 వ తేదీ రంగంవుంటాయి. # ఓల్డ్ సిటీ లాల్ దర్వాజ్ బోనాలు జూలై 20 వ తేదీ బోనాలు, జూలై 21 రంగం జరుగుతాయి. బోనాల ఉత్సవాలకు 20 కోట్ల రూపాయలతో ఏర్పాట్లు చేస్తున్నారు.

Politent News Web3

Politent News Web3

Next Story