People are dissatisfied with the ruling party MLAs in AP within a year

ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఈ నెల 12వ తేదీ నాటికి ఏడాది పాలన పూర్తి కానుంది. అదే రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనా బాధ్యతలు తీసుకున్నారు. ఏడాది కాలంలో ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత పెరుగుతోందని పలు సర్వే సంస్థలు హెచ్చరిస్తున్నాయి. వైసిపి హయాంలో కూటమికి అనుకూలంగా ఫలితాలు ఇచ్చిన రైజ్ సర్వే సంస్థ.. ఇప్పుడు కూటమికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వే వివరాలు వెల్లడించడం విశేషం. సదరు సర్వే ప్రతినిధి ప్రవీణ్ పుల్లట ప్రాంతాలవారీగా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు ఇస్తున్నారు. తాజాగా ఉత్తరాంధ్రకు సంబంధించి సర్వే వివరాలను వెల్లడించారు.

ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు, ఉమ్మడి విజయనగరంలో 9, ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో 34 అసెంబ్లీ స్థానాలకు గాను టిడిపి కూటమి 32 చోట్ల విజయం సాధించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల మాత్రమే గెలుపొందింది. శ్రీకాకుళంతో పాటు విజయనగరంలో టిడిపి కూటమి క్లీన్ స్వీప్ చేసింది. పార్లమెంట్ స్థానాలను సైతం టిడిపి కూటమి గెలుచుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం అరకు పార్లమెంటు స్థానంతో సరిపెట్టుకుంది.

అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూటమి ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉందని రైజ్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. సగానికి పైగా ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని ప్రవీణ్ పుల్లట సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. 32 మంది టిడిపి కూటమి ఎమ్మెల్యేల్లో 17 మందిపై అసంతృప్తి ఉందని సర్వేలో వెల్లడైంది. నాలుగు ప్రాంతాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న మొత్తం ఎమ్మెల్యేల జాబితా మీకోసం అంటూ ఆయన హింట్ ఇచ్చారు. త్వరలో మిగిలిన మూడు ప్రాంతాల లెక్కలను విడుదల చేసేందుకు రైజ్ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో టీడీపీ కూటమి శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. గతంలో ఇదే సంస్థ కూటమికి అనుకూల ఫలితాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

Politent News Web3

Politent News Web3

Next Story