Supreme Court orders release of senior journalist Kommineni Srinivasa Rao

అమరావతి మహిళలపై వ్యాఖ్యల కేసులో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కొమ్మినేని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం విడుదలకు సంబంధించిన నిబంధనలు ట్రయల్ కోర్టు ఇస్తుందని స్పష్టం చేసింది. పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ మొట్టికాయల వేసింది. వాక్ స్వాతంత్రన్ని రక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని న్యాయమూర్తులు ప్రభుత్వానికి సూచించారు. నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా... అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేము కూడా నవ్వుతుంటామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పిటిషన్ లోని ముఖ్యాంశాలు:

కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేశారు

మూడేళ్ల లోపు శిక్ష పడే నేరాలకు పోలీసులు ముందుగా 41 కింద నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి

నోటీసు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టు చేశారు

సుప్రీంకోర్టు తీర్పును పోలీసులు పాటించలేదు

కేఎస్సార్ లైవ్ షో లో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారు

అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని గెస్ట్ ను యాంకర్ కేఎస్ఆర్ నియంత్రించారు ... వాటిని సమర్థించలేదు

తెలంగాణలో అరెస్టు చేసి 331 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్లో రిమాండ్ చేశారు

ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోలేదు

కొమ్మినేని సీనియర్ జర్నలిస్టు ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేదు

70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్

కొమ్మినేని దర్యాప్తును తప్పించుకునే ప్రయత్నం చేయలేదు

స్థానిక కోర్టులో కొమ్మినేని తరఫున న్యాయవాదిని అనుమతించలేదు

సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధం

ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19, 21 ,22(1)ను ఉల్లంఘించారు

ప్రజాస్వామ్య నాలుగో స్తంభమైన మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు

వాక్ స్వాతంత్రానికి భంగం కలిగిస్తున్నారు

అక్రమ అరెస్టుతో ఆయన జీవించే హక్కుకు భంగం కలిగింది

Politent News Web3

Politent News Web3

Next Story