Teacher posts for special needs students in Andhra Pradesh

పాఠశాల విద్యా శాఖకు సంబంధించి 2,260 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. W.P.(C) నెం. 132/2016 లో సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులకు అనుగుణంగా 1136 SGTs, 1124 పాఠశాల సహాయకుల పోస్టులు మొత్తం 2,260 ఖాళీగా ఉన్న అదనపు పోస్టులుగా మార్చుతూ ఏప్రిల్ 15న పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన G.O.Ms. నెం.13ను దృవీకరించేందుకు చేసిన ప్రతిపాదనకు ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు విద్యావకాశాలను పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల కోసం 2,260 కొత్త పోస్టుల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మేధోపరమైన వైకల్యాలు, ప్రత్యేక అభ్యాస వైకల్యాలు వంటి పరిస్థితులు ఉన్న వ్యక్తులకు తగిన విద్యాపరమైన మద్దతును అందించడమే దీని లక్ష్యమని మంత్రి మండలి భావించింది. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల విద్యా హక్కులను పునరుద్ధరించడంలో, విద్యా వ్యవస్థలో సమానత్వాన్ని ప్రోత్సహించడంలో ఇది కీలకమైన దశ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ కేటగిరీలలో 245 పోస్టుల కల్పనకు న్యాయ శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జిల్లా జడ్జి కేడర్లో రిజిస్ట్రార్ (జ్యుడీషియల్. II), రిజిస్ట్రార్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్), ఎడిటర్, జాయింట్ రిజిస్ట్రార్లు, డిప్యూటీ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, సెక్షన్ ఆఫీసర్లు, కోర్ట్ ఆఫీసర్లు, స్క్రూటినీ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారువాటితో పాటు అకౌంట్స్ ఆఫీసర్, డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్/ట్రాన్స్‌లేటర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అప్పల్ డివిజన్ స్టెనో, అసిస్టెంట్లు, ఎగ్జామినర్లు, టైపిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, కాపియర్ మెషిన్ ఆపరేటర్లు, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, సిస్టమ్ ఆఫీసర్, సిస్టమ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్లు, ప్రాజెక్ట్ లీడర్/ప్రాజెక్ట్ హెడ్, మాడ్యూల్ లీడర్లు/ యూజర్ ఇంటర్ఫేస్(UI) వెబ్ డిజైనర్ల అదనపు పోస్టులకు అనుమతిని మంజూరు చేయాలని ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ కేటగిరీలలో రెండు వందల నలభై ఐదు (245) పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Updated On 23 May 2025 1:53 PM IST
Politent News Web3

Politent News Web3

Next Story