ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థిరాస్తి వ్యాపారాభివృద్ధి కోసం బిల్డర్లకు బంపరాఫర్ ప్రకటించింది. బహుళ అంతస్తులకు సంబంధించిన డెవలప్‌మెంట్‌, బెటర్‌మెంట్‌ ఛార్జీలను బిల్డర్లు ఇకపై వాయిదా పద్ధతిలో చెల్లించే అవకాశం కల్పించింది. ఇంపాక్ట్‌ ఫీజు, లేబర్‌సెస్‌ వంటివి విడతలవారీగా వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం డెవలప్‌మెంట్‌, బెటర్‌మెంట్‌ ఛార్జీలను కూడా ఇదే పద్ధతిలో చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. దీనికి సంబంధించి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం రూ.15 లక్షలలోపు ఫీజులైతే ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది.. రూ.15 లక్షల నుంచి రూ.75 లక్షలలోపు ఫీజు 12 నెలల్లో నాలుగు విడతలుగా చెల్లించాల్సి ఉంటుంది. 12% వడ్డీ ఉంటుంది. అలాగే రూ.75 లక్షలపైన ఉంటే 24 నెలల్లో 8 వాయిదాల్లో 12% వడ్డీతో సమాన వాయిదాల్లో చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బహుళ అంతస్తుల నిర్మాణ ప్రాంతంలో ఇప్పటివరకూ 10% పుర, నగరపాలక సంస్థలకు తనఖా పెడుతున్నారు. ఇకపై 15 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఒకేసారి ఛార్జీలను చెల్లించాల్సి రావడం తమకు ఆర్థికంగా ఇబ్బంది అవుతోందని.. ఈ రుసుముల్ని వాయిదా పద్ధతిలో జమ చేసే అవకాశం కల్పించాలని ఇటీవల ప్రభుత్వాన్ని బిల్డర్లు రిక్వెస్ట్ చేసింది. వెంటనే ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంది. ఛార్జీల పెంపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నరెడ్కో రాష్ట్ర అధ్యక్షుడు గద్దె చక్రధర్‌ స్వాగతించారు, హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బహుళ అంతస్థుల యజమానులకు ఊరట దక్కనుంది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్, బిల్డర్ల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. భవన నిర్మాణాలతో పాటుగా పన్నుల చెల్లింపుల విషయంలో కొన్ని వెసులుబాటు కల్పించారు. తాజాగా రుసుముల చెల్లింపుల విషయంలో కూడా వెసులుబాటు కల్పించారు. బిల్డర్లు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆనందంలో ఉన్నారు.

Updated On
Politent News Web3

Politent News Web3

Next Story