పలు ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాలో అంతరాయం

హైదరాబాద్ జల మండలి ఈ నెల 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు నగరం లోని పలు ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు ప్రకటించింది..

గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-1 కింద 900 మిల్లీమీటర్ల వ్యాసం గల వాల్వుల మార్పిడి పనులు చేపడుతున్న కారణంగా ఈ సమస్య తలెత్తనుంది. అదనంగా, ముర్మూర్, మల్లారం, కొండపాక పంపింగ్ స్టేషన్లలో మరమ్మతులు కూడా జరుగనున్నాయి..

ప్రభావిత ప్రాంతాలు:

డివిజన్ 6: ఎస్.ఆర్. నగర్, సనత్‌ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, సోమజిగూడ, ఫతే నగర్, జూబ్లీహిల్స్ మరియు పరిసరాలు..

డివిజన్ 7: లాలాపేట్, తార్నాకా కొంత భాగం..

డివిజన్ 9: కుకట్‌ పల్లి, భాగ్య నగర్, మోతీ నగర్, కెపిహెచ్‌బి, బాలాజీ నగర్..

డివిజన్ 12: చింతల్, సుచిత్ర, షాపూర్‌ నగర్, సూరారం, గాజుల రామారం, జగద్గిరి గుట్ట..

డివిజన్ 8: అల్వాల్, మచ్చ బోలారం, యాప్రాల్, గౌతమ్‌ నగర్, మౌలాలి రిజర్వాయర్ పరిసరాలు..

డివిజన్ 14 (కాప్రా): చర్లపల్లి, రాధికా, కైలాసగిరి, మల్లాపూర్..

డివిజన్ 15: కొండాపూర్, మాధాపూర్, గచ్చిబౌలి, నల్లగండ్ల కొంత భాగం..

డివిజన్ 17: హఫీజ్‌ పేట్, మియాపూర్..

డివిజన్ 19: పొచారం..

డివిజన్ 21: కొంపల్లి, జవహర్‌ నగర్, దమ్మాయి గూడ, నాగారం, అయ్యప్ప కాలనీ..

డివిజన్ 22: నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, గండి మైసమ్మ, బోల్లారం, తెల్లాపూర్..

అదనంగా, ట్రాన్స్‌మిషన్-4 కింద హకీం పేట్ ఎయిర్‌ ఫోర్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, AIIMS బీబీనగర్ ప్రాంతాల్లో కూడా నీటి సరఫరా ప్రభావితం కానుంది.. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో అలేర్ (భువనగిరి), ఘన్ పూర్ (మెడ్చల్/శామీర్‌పేట్) ప్రాంతాలు ప్రభావిత మవనున్నాయి..

ఈ నేపథ్యంలో, ఆయా ప్రాంతాల ప్రజలు తగినంత నీటిని ముందుగానే నిల్వ చేసుకోవాలని, నీటిని అత్యవసర అవసరాలకు మాత్రమే వినియోగించాలని జల మండలి విజ్ఞప్తి చేసింది. మరమ్మతుల పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరా పునరుద్ధరించ నున్నట్లు అధికారులు తెలిపారు

Politent News Web3

Politent News Web3

Next Story