బేడీ కుటుంబం వారసురాలు అలయా ఫర్నీచర్ వాలా
మోడలింగ్ లో ఓ స్థాయికి చేరుకున్న అలయా.. నటనలోను మెప్పించింది

హీరోయిన్ అలయా ఫర్నీచర్ వాలా బాలీవుడ్ లో పాపులర్. మోడలింగ్ లో ఓ స్థాయికి చేరుకున్న అలయా.. నటనలోను విమర్శకులను మెప్పించింది.
అలయా ఎఫ్ 1997లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జన్మించింది
అలనాటి నటుడు కబీర్ బేడీ మనవరాలు కాగా... ప్రముఖ నటి పూజా బేడీ గారాల పట్టి అలయా
అలయా తల్లి పంజాబీ కాగా తండ్రి పార్శీ... ఈ ముద్దుగుమ్మ పూర్తిపేరు అలయా ఇబ్రహిం ఫర్నీచర్ వాలా
అలయా ముంబైలో స్కూలింగ్ పూర్తి చేసుకొని న్యూయార్క్ ఫిలిం అకాడమీలో నటనలో తర్ఫీదు పొందింది
వెస్ట్రన్ డాన్స్ తోపాటు కథక్ లో అలయా ప్రావిణ్యం సాధించింది
యోగాలో అలయా ఫిట్స్ చూస్తే అదిరిపోవల్సిందే..శరీరాన్ని ఎక్కుపెట్టిన ధనస్సులా మార్చేస్తుంది
లెన్స్ కార్ట్, నైకా తదితర ప్రముఖ ఉత్పత్తులకు అలయా బ్రాండ్ అంబాసిడర్
2020లో హాస్య చిత్రం జవానీ జానేమాన్ తో అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నూతన నటీమణి అవార్డు కొట్టేసింది
ప్రస్తుతం హైదరాబాద్ కు చెందిన పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్ల బయోపిక్ తోపాటు బడే మియా చోటే మియా సినిమాలో చేస్తోంది
ప్రస్తుతం హిందీలోనే చేస్తున్న ఈ చిన్నది దక్షిణాదిలో అవకాశం వస్తే సత్తా చూపెడుతానంటోంది
courtesy : instagram
