antara biswas: బెంగాలి రసగుల్లా మొనాలిసా
రసగుల్లా మాదిరి ఉండే ఈ భామ బోజ్ పురిలో టాప్ హీరోయిన్

మొనాలిసా బాలీవుడ్, బోజ్ పురి హీరోయిన్. రసగుల్లా మాదిరి ఉండే ఈ భామ బోజ్ పురిలో టాప్ హీరోయిన్. తెలుగులో కూడా నటించిన మొనాలిసా అసలు పేరు అంతరా బిశ్వాస్. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ బొద్దుగుమ్మ అందాలకు అభిమానులు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
అంతరా బిస్వాస్ 1981 నవంబరు 21న కలకత్తాలో బెంగాలీ కుటుంబంలో జన్మించింది.
కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి సంస్కృతంలో బి.ఎ. డిగ్రీ చేసింది.
ఒడియా వీడియో ఆల్బమ్‌లలో టెలివిజన్ నటిగా, మోడల్‌గా అంతరా కెరీర్ ప్రారంభించింది
1997లో జయతే హిందీ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది
అజయ్ దేవగన్, సునీల్ శెట్టి నటించిన బ్లాక్‌మెయిల్ (2005) చిత్రంతో ఈ చిన్నది బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది.
భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మొనాలిసాకు పేరుంది.
2017 జనవరి 17న బిగ్ బాస్ హౌస్‌లో భోజ్‌పురి నటుడు విక్రాంత్ సింగ్ రాజ్‌పూత్‌ను మొనాలిసా వివాహం చేసుకుంది
2022లో ఆమె తన భర్త విక్రాంత్ సింగ్ రాజ్‌పూత్‌తో కలిసి స్టార్ ప్లస్ స్మార్ట్ జోడిలో పాల్గొంది.
ఈ బెంగాలి భామ 2008లో నగరం అనే తెలుగు సినిమాతో పాటు జగడం, బోని సినిమాల్లో ప్రత్యేక పాత్రలో నటించింది.
courtesy:instagram

