కన్నడ, తెలుగు, తమిళ చిత్రాల్లో ఆషికా రంగనాథ్ బిజీగా ఉంది

బాపు బొమ్మలా ఉంటుంది హీరోయిన్ ఆషికా రంగనాథ్. తెలుగులో అమిగోస్, నా సామి రంగా సినిమాలతో పాపులరైన ఆషికా తొందరలోనే విశ్వంభరగా దర్శనం ఇవ్వబోతోంది.
1996లో కర్ణాటకలోని తుంకూరులో ఆషికా జన్మించింది.
బెంగళూరులో చదువుకున్న ఈ చిన్నది.. పాశ్చాత్య, భారతీయ నృత్యాలతోపాటు ఫ్రీ స్టైల్, బెల్లి డాన్సుల్లో కూడా ప్రావిణ్యం సాధించింది
2014లో బెంగళూరులో నిర్వహించిన మిస్ ఫ్రెష్ ఫేస్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది.
సొగసరి ఆషికా అక్క అనూష రంగనాథ్ కూడా హీరోయిన్. కన్నడనాట సుపరిచితురాలు
కన్నడ సినిమా క్రేజీ బాయ్ తో ఆషికా వెండితెరకు పరిచయం అయింది.
క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీలో ఆషికాను చూసిన దర్శకుడు మహేష్ బాబు క్రేజీ బాయ్స్ సినిమాకు ఎంపిక చేయడంతో నట జీవితం ప్రారంభమైంది.
2023లో అమిగోస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది
ప్రస్తుతం తమిళంలో సర్దార్-2, తెలుగులో విశ్వంభర, కన్నడలో గతవైభవ సినిమాలు చేస్తోంది
కన్నడ, తెలుగు, తమిళ చిత్రాల్లో బిజీగా ఉన్న ఆషికా… సోషల్ మీడియాలోను యాక్టీవ్ గా ఉంటుంది.
courtesy : instagram
