నటి, మోడల్ దివ్య అగర్వాల్... కోరియోగ్రాఫర్ గా పాపులర్.

నటి, మోడల్ దివ్య అగర్వాల్... కోరియోగ్రాఫర్ గా పాపులర్. రాగిణి ఎంఎంఎస్: రిటర్న్స్ 2 అనే భయానక వెబ్ సిరీస్‌తో నటనా రంగ ప్రవేశం చేసిన దివ్యా సోషల్ మీడియాలో కిక్కెంచే ఫోటోలు షేర్ చేస్తోంది.


దివ్య అగర్వాల్ 4 డిసెంబర్ 1992న ముంబైలో జన్మించింది.


దివ్య అగర్వాల్ జర్నలిజం లో మాస్టర్స్ డిగ్రీ అందుకుంది.


టెరెన్స్ లూయిస్ డ్యాన్స్ అకాడమీ నుండి డ్యాన్స్‌లో శిక్షణ పొందిన దివ్యా... ఎలివేట్ డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్ అనే పేరుతో సొంతంగా డ్యాన్స్ అకాడమీ ప్రారంభించింది.


ఇలియానా డిక్రుజ్, సన్నీ లియోన్, శిల్పాశెట్టి తదితర అగ్ర నటీమణులకు కొరియోగ్రఫీ చేసింది.


ఓ పాకిస్తానీ కొరియోగ్రాఫర్ తో కలిసి ఐపిఎల్ 2010 కోసం దివ్యా కొరియోగ్రఫీ చేసింది.


దివ్య అగర్వాల్ 2017లో ఎంటీవి ఇండియా స్ప్లిట్స్‌విల్లా 10లో పాల్గొన్నది


2018 అక్టోబర్‌లో ఎంటీవి ఇండియా ఏస్ ఆఫ్ స్పేస్ 1లో పాల్గొన్న దివ్యా అక్కడ విజేతగా నిలిచింది.


2019లో ఇన్‌సైట్ టీవీలో ప్రసారమైన ట్రావెల్ విత్ ఎ గోట్‌లో పాల్గొనడం ద్వారా మొదటి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లో పాల్గొన్నది.


ఇద్దరి ముగ్గురితో డేటింగ్ చేసిందని పుకార్లు వచ్చినా...అపూర్వ పడ్ గోంకర్ ను మనువాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.



courtesy: instagram











Updated On 7 July 2025 1:12 PM IST
Politent News Web3

Politent News Web3

Next Story