హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి అధితి పాత్రలకు పరిమితమైంది

టాలీవుడ్ అభిమానులకు సుపరిచితం హీరోయిన్ హంసా నందిని. సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ క్యాన్సర్ నుంచి కోలుకొని కొంత కాలం నుంచి సినిమా కార్యక్రమాల్లో పాల్గొంటోంది.


మరాఠీ కుటుంబానికి చెందిన హంసా నందిని 1984 లో పూనేలో పుట్టింది.


ఈ అమ్మడి అసలు పేరు పూనం కాగా... అనుమానాస్పదం సినిమా సమయంలో దర్శకుడు వంశీ హంసా నందినిగా మార్చారు.


కామర్స్ లో డిగ్రీ చేసిన హంసా నందిని 2009 లో హ్యూమన్ రిసోర్స్ కోర్స్ లో చేరింది.


మోడలింగ్ పై మోజుతో ముంబై చేరుకున్న ఈ భామ 2002 నుంచి మోడలింగ్ రంగంలో ఉంటూ పలు టెలివిజన్ ప్రకటనలలో నటించింది.


2004 లో ఒకటవుదాం తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయం అయింది.


2006లో హిందీలో బిపాస బసుతో కలిసి కార్పొరేట్ సినిమాలో మెరిసినా... ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ లోనే అధికంగా అవకాశాలు వచ్చాయి.


డజనుకు పైగా తెలుగు సినిమాల్లో చేసిన హంసానందిని హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి అధితి పాత్రలకు పరిమితమైంది.


2021లో రొమ్ము క్యాన్సర్ రావటంతో కొంత కాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉంది


2022 నాటికి కోలుకున్నా ప్రస్తుతం సినిమాలు చేయడం అడపా దడపా సినిమా కార్యక్రమాలకు హాజరవుతోంది.


courtesy : instagram









Politent News Web3

Politent News Web3

Next Story