దిల్ సే సినిమాలో చయ్య చయ్య పాటతో చెరగని ముద్ర వేసింది.

మలైకా అరోరా సినిమాల్లో కనిపించింది తక్కువే అయినా ప్రత్యేక గీతాల్లో తళుక్కుమని మెరిసి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. దిల్ సే సినిమాలో చయ్య చయ్య పాటతో చెరగని ముద్ర వేసింది. సినిమాల కన్నా మోడలింగ్ లో బిజీగా ఉండే మలైకా అరోరా… ఫోటోలు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.
1973లో జన్మించిన మలైకా అరోరా ఫిట్ నెస్ కు మారుపేరుగా మారింది. 50 ఏళ్ల వయసు వచ్చినా వన్నె తగ్గని అందం మలైకా సొంతం.
మలైకా అంటే స్వాహిలి భాషలో దేవత(ఏంజెల్) అని అర్థం. స్వాహిలీ భాష తూర్పు ఆఫ్రికాలోని కెన్యా,టాంజనియా, బురుండి, మెజాంబిక్ దేశాల్లో మాట్లాడుతారు.
మలైకా పదకొండేళ్ల వయసులోనే తల్లి,తండ్రులు విడిపోయారు. తల్లి, సోదరి అమృత అరోరాతో కలిసి ముంబై చెంబూరుకు మారింది.
తల్లి జాయ్స్ పాలీకార్ప్ మలయాళీ క్యాథలిక్ కాగా… తండ్రి అనిల్ అరోరా పంజాబీ వ్యాపారవేత్త.
డిగ్రీ విద్యాబ్యాసం అర్దాంతరంగా ఆపేసిన మలైకా…MTV VJగా బుల్లితెరపై కార్యక్రమాలు చేసింది.
టెలివిజన్ రంగంలో చేస్తున్న సమయంలో దిల్ సే సినిమాలో ప్రత్యేక గీతానికి ఎంపికైంది.
1998లో యువతకు క్రేజీ ఫిగర్ గా మారిన మలైకా…సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు(అర్హాన్ ఖాన్) ఉన్నాడు.
అర్భాజ్, మలైకా కలిసి స్థాపించిన ప్రొడక్షన్ లో దబాంగ్ సినిమా సీక్వెల్స్ తీశారు. ఈ సినిమాలో మున్నీ బద్నాం పాటతో తన క్రేజ్ కు ఢోకా లేదని మలైకా నిరూపించింది.
దాదాపు 20 ఏళు సంసారం చేసిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో సహ జీవనం చేసింది. అయితే గత ఏడాది వీరిద్దరు వీడిపోయినట్టు వార్తలు వచ్చాయి. 12 ఏళ్ల చిన్నవాడితో డేటింగ్ ఏంటని విమర్శలు వచ్చాయి.
మలైకాకు అర్జున్ ఎందుకు దూరంగా ఉన్నాడో ఇంకా తెలియరాలేదు. తాజాగా మరో మిస్టరీ మ్యాన్ తో మలైకా పార్టీలకు హాజరవుతోందని బాలీవుడ్ లో టాక్. మిస్టరీ మ్యాన్ రాహుల్ విజయ్ తో డేటింగ్ లో ఉందని సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి.
2020లో వెగాన్ గా మారిన మలైకా ప్రస్తుతం ఫుడ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టి వాటిని ప్రమోట్ చేసే పనిలో ఉంది.
చిన్నతనం నుంచే కష్టసుఖాలను చూస్తున్న మలైకా ఇద్దరి నుంచి దూరమైనా ఎలాంటి కామెంట్ చేయలేదు. గ్లామర్ పాత్రలు పోషిస్తూ…హాట్ బ్యూటీగా కనిపించే మలైకా సున్నిత మనస్కురాలని సన్నిహితులు ప్రశంసిస్తారు.
courtesy : instagram
