లక్కీ భాస్కర్ తో మంచి ఫామ్ లో ఉన్న మీనాక్షి చౌదరీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మాస్ ప్రేక్షకులకు దగ్గరయింది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత యూత్ కు క్రేజీగా మారిన మీనాక్షి... తాజాగా అందాల విందు చేసిన ఫోటోలు యూత్ కు మత్తెక్కిస్తున్నాయి.


మీనాక్షి చౌదరి 1996 మార్చి 5న హరియాణాలోని పంచ్​కులాలో జన్మించింది.


ఈ చిన్నది డెంటల్ డాక్టర్. పంజాబ్​లోని నేషనల్​ డెంటల్​ కాలేజీ అండ్​ హాస్పిటల్​లో డెంటల్​ సర్జరీ కోర్సు చేసింది.


ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి 2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.


2021లో విడుదలైన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో హీరోయిన్​గా తెలుగు సినీరంగంలోకి మీనాక్షి చౌదరీ అడుగుపెట్టింది.


పంజాబీ, హిందీ భాషల్లో వివిధ అల్బమ్స్ లో ప్రతిభ చాటిన మీనాక్షి తెలుగులోనే అధికంగా సినిమాలతో అలరించింది.


ఖిలాడీ, హిట్ ది సెకండ్ కేస్, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, గోట్, మట్కా సినిమాల్లో తళుక్కుమంది.


తమిళంలో సింగపూర్ సెలూన్, కొలై(హత్య) సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.


2025లో రాబోయే విశ్వంభర, మెకానిక్ రాకీ సినిమాలతో మీనాక్షి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.



courtesy : instagram










Politent News Web3

Politent News Web3

Next Story