ఓహ్ మామా టెటెమా(Oh mama Tetema) లుక్ హల్ చల్

మొరాకో దేశానికి చెందిన నోరా ఫతేహీ కెనడాలో విద్యాబ్యాసం చేసింది. భారతీయ చిత్ర పరిశ్రమలో నేడు టాప్ స్టార్ల సరసన చేరింది. సోషల్ మీడియాలో టాప్ స్టార్ గా పేరు దక్కించుకుంది. ఇంటర్ నేషనల్ మ్యూజికల్ నైట్ ఫస్ట్ లుక్ తో ఆకట్టుకుంటోంది.


కెరిర్ తొలినాళ్లల్లో అవమానాలు ఎదుర్కొన్న ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో స్థిరపడింది. ఈమె ప్రతిభకు అదృష్టం కూడా తోడైంది.


చిత్రపరిశ్రమలోకి రాకముందు ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడ్డవారే. సినిమా చాన్సులు వచ్చాక స్టార్ స్టేటస్ లభిస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఒక్కొసారి సంవత్సరాల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా అవకాశాలు లభించవు.


ఒకప్పుడు 100 రూపాయల జీతానికి సినిమాల్లో పనిచేసిన నోరా ఫతేహీ..ఈ రోజు 4 నిమిషాలు చేస్తే చాలు రూ .2కోట్ల పారితోషకం తీసుకునే స్థాయికి ఎదిగింది. నోరా ఫతేహి తన కష్టంతో ఎంతలా ప్రేక్షకులను ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.


తెలుగులో టెంపర్‌, కిక్‌2, లోఫర్‌, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది. స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను మెప్పించిన బ్యూటీ నోరా ఫతేహి.. రాజమౌళి దర్శకత్వంలో, ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి సినిమాలో మనోహరి అనే పాటలో కనిపించి యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది.


బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ లో అదరగొట్టిన ఈ బ్యూటీకి సౌత్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. నోరా ఫతేహీ ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద క్రేజీ ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.


ఇంగ్లీష్, హిందీ, స్వాహిలీ భాషల కలయికలో మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్ రాబోతోంది. ఓహ్ మామా టెటెమా(Oh mama Tetema)టైటిల్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.


courtesy : instagram








Updated On 7 Aug 2025 4:04 PM IST
Politent News Web3

Politent News Web3

Next Story