తెలుగు కుటుంబానికి చెందిన శ్రేయ..హైదరాబాద్ టు ఢిల్లీ మీదుగా ముంబై

హీరోయిన్ శ్రేయా ధన్వంతరి. తెలుగు కుటుంబానికి చెందిన శ్రేయ..హైదరాబాద్ టు ఢిల్లీ మీదుగా ముంబై చేరుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ భామ హర్ట్ బీట్ పెంచే ఫోటోలతో అభిమానులకు మత్తెక్కిస్తోంది.


శ్రేయ ధన్వంతరి 1988 లో హైదరాబాద్ లో జన్మించింది.


ఢిల్లీలో పెరిగిన శ్రేయ...వరంగల్ NITలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది.


ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం విద్యార్థిగా ఉన్నప్పుడు ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2008 పోటీలో పాల్గొన్నది.


ఆ తర్వాత మిస్ ఇండియా 2008 పోటీలో ఫైనలిస్ట్‌గా పోటీ పడింది.


ఎయిర్‌టెల్, పాంటలూన్స్, సఫీ, ప్రోవోగ్, వోగ్ ఐవేర్, గీతాంజల్ మాయ బంగారు ఆభరణాలు, డిడామాస్ ఆభరణాలు, జాష్న్ చీరలు, లిబర్టీ ఫుట్వేర్ వంటి సంస్థల ప్రచార చిత్రాలలో నటించింది.


మిస్ ఇండియా 2008 పోటీ తరువాత, స్నేహగీతం సినిమాలో నటించింది.


ఇమ్రాన్ హష్మి నటించిన వై చీట్ ఇండియా చిత్రంతో హిందీ సినిమారంగంలోకి అడుగుపెట్టింది.


అందాల ఆరగింపు చేసే ఈ చిన్నది..ఫేడ్ టు వైట్ అనే పుస్తకాన్ని కూడా రాసింది.


2020లో స్కామ్ 1992 వెబ్ సిరీస్ లో సుచేతా దలాల్ పాత్రను పోషించింది.


ప్రస్తుతం హిందీలో సినిమాలు, వెబ్ సీరీసులతో బిజీగా ఉన్న శ్రేయాకు...తెలుగులో జోష్, స్నేహగీతం తర్వాత అవకాశాలు రాలేదు. టాలీవుడ్ లో చాన్స్ ఇస్తే సత్తా చూపెడుతానని చాలెంజ్ చేస్తోంది.



courtesy: instagram









Politent News Web3

Politent News Web3

Next Story