ఐదు పదుల్లోను తరగని అందం టబు సొంతం
actress tabu latest photo shoot

తబస్సుమ్ అలియాస్ టబు టాలీవుడ్ లో తక్కువ సినిమాలే చేసినా... తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఐదు పదుల్లోను తరగని అందం టబు సొంతం. కొంతకాలంగా బాలీవుడ్‌కే పరిమితమై వరుస చిత్రాలతో హడావిడి చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టబు…బోల్డు పిక్చర్స్ కలెక్షన్ చూద్దాం.
1990ల్లో టాలీవుడ్లో హవా కొనసాగించిన టబు తక్కువ సినిమాలతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
హీరో అజెయ్ దేవగణ్ కు మంచి స్నేహితురాలు కాగా ఇంకా పెళ్లి చేసుకోని టబు 53 ఏళ్ల వయసులో కూడా తన అంద చందాలతో మత్తెక్కిస్తోంది. అత్త, వదిన పాత్రలు చేస్తున్న టబు బోల్డు పోజులతో కుర్ర హీరోయిన్లకు సవాల్ విసురుతోంది.
1993లో నిన్నే పెళ్లాడతా సినిమా తర్వాత నాగార్జున, టబు రిలేషన్ పై అనేక రూమర్లు రాగా ప్రేమదేశం సినిమాతో యువకుల హృదయాల్లో ప్రేయసిగా నిలిచిపోయింది.
హైదరాబాద్‌కు చెందిన టబు అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మి. 1971 నవంబర్ 4వ తేదీన జమాల్ అలీ హష్మీ, రిజ్వానా దంపతులకు హైదరాబాదీ ముస్లిం కుటుంబంలో జన్మించారు.
ఆమె తండ్రి పాకిస్తాన్లో నటుడిగా కొన్ని సినిమాలు చేశాడు. 1970లో భారతదేశానికి వచ్చిన టబు తండ్రి ఆమెకు మూడేళ్ల వయసులో కుటుంబాన్ని విడిచిపెట్టాడు.
బాలీవుడ్లో బాలనటిగా సినిమాలు చేసిన టబు… కొన్నేళ్ల తర్వాత అక్కడే హీరోయిన్గా ముందుకు వచ్చింది. ‘కూలీ నెం 1’ మూవీతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.
టాలీవుడ్ లో బాలకృష్ణతో ‘పాండురంగడు’ సినిమా తర్వాత టబుకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో’తో ఆమె రీఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది.
ఐదు పదులు దాటిపోయినా టబు ఇంకా పెళ్లి చేసుకోలేదు. పైగా సినిమాల్లో దూకుడు పెంచింది. ‘దృశ్యం 2’తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
‘భూల్ భులయా’లో ద్వీపాత్రభినయంతో విమర్శకులను మెప్పించింది. 2024లో ‘కుత్తే’, ‘భోళా’ సినిమాలు రాగా ఇప్పుడు ‘ఖుఫియా’, ద క్రూ తదితర సినిమాలతో పాటు డూన్ ప్రోఫెసీ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించింది.
courtesy : instagram
