వింబుల్డన్ ఫైనల్స్ లో ఊర్వశీ రౌటేలా
డాకు మహారాజ్ చిత్రంలో బాలయ్యకు ధిటుగా స్టెప్పులేసింది

ఊర్వశి రౌతేలా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషా చిత్రాలలో నటించింది. బాలయ్య సరసన డాకు మహారాజ్ చిత్రంలో ఆయనకు ధిటుగా స్టెప్పులేసింది. దక్షిణ భారత దేశంలో అన్ని భాషల ప్రేక్షకులను ఊర్వశి మెప్పించింది. వింబుల్డన్ ఫైనల్స్ లో పాల్గొని అందాలతో ఆకట్టుకుంది.
గ్వాలియర్ రాజ్ పుత్ కుటుంబానికి చెందిన ఉర్వశీ రౌటేలా 1994లో జన్మించింది
పదేహేనేళ్ల వయసులో వీల్స్ ఫ్యాషన్ వీక్ లో టైటిల్ సాధించిన ఊర్వశీ ఇక వెనక్కి తిరిగి చూడలేదు.
2013లో సింగ్ సాబ్ ద గ్రేట్ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది.
2012లోనే ఇష్క్ జాదే సినిమాలో అవకాశం వచ్చినా... విశ్వసుందరిల పోటీల కోసం ఆ సినిమా చాన్స్ వదులుకుంది.
వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి సరసన స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకులను అలరించింది.
సినిమాల్లో ఊర్వశి కనిపించే సన్నివేశాలు, పాటలలో హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తన నృత్యంతో యూత్ మనసు దోచుకుంది.
ఊర్వశి యో యో హనీ సింగ్ తో పాటు అంతర్జాతీయ వీడియో ఆల్బమ్ లవ్ డోస్లో కనువిందు చేసింది. ఇది 2014 అక్టోబరులో విడుదలైంది.
డాకు మహారాజ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నా ఊర్వశీ చేసిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
వెలకమ్ టు జంగల్, కసూర్ 2హిందీ సినిమాలతో పాటు తెలుగులో ఓ సినిమా చేస్తోంది.
courtesy : instagram
