క్రికెట్ ప్రెజెంటర్ యేషా సాగర్
పంజాబీ సినిమాల్లో నటిస్తున్న యేషా మోడల్ గా బిజీ

యేషా సాగర్ క్రికెట్ ప్రెజెంటర్ గా ఫేమస్. పంజాబీ సినిమాల్లో నటిస్తున్న యేషా మోడల్ గా బిజీగా ఉంటూనే... సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.

1996లో పంజాబ్ లుథియానాలో జన్మించిన యేషా స్థానిక ఖల్సా కాలేజీలో విద్యాబ్యాసం చేసి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లింది.

కెనడాలో మోడల్ గా కెరీర్ ప్రారంభించిన యేషా ఆ తర్వాత పంజాబీ మ్యూజిక్ అల్బమ్స్ లో నటించింది.

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో క్రికెట్ ప్రెజెంటర్ గా అలరించిన యేషా సాగర్…లీగ్ నుంచి అర్దాంతరంగా తప్పుకోవటం చర్చనీయాంశం అయింది.

పంజాబీ గాయకులు జిప్పీ గ్రేవాల్, కుల్బీర్ జింజర్ లతో కలిసి చేసిన మ్యూజిక్ అల్బమ్స్ యేషాకు పాపులారిటీ సంపాదించిపెట్టాయి.

ఫిట్ నెస్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన యేషా సాగర్…insta వాల్ పై చూపుతిప్పుకోనివ్వని ఫోటోలు దర్శనం ఇస్తాయి.

హస్కీ అందాలతో మత్తెక్కించే యేషా…2023లో యారా ద రుత్ బా(yaaran da rutba) అనే పంజాబీ సినిమాలో నటించింది.

కామెడీ ప్రోగ్రామ్స్ చేసే కపిల్ శర్మతో కలిసి 28 ఏళ్ల యేషా సాగర్ చేసిన వీడియాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

ట్రావెలింగ్ ఇష్టపడే యేషా సాగర్… తరచుగా వివిధ దేశాలు సందర్శిస్తూ.. అక్కడి విశేషాలతో కూడిన ఫోటోలు షేర్ చేస్తుంది.

ఒడ్డు పొడుగు(5.7 height) చూడ చక్కని రూపంతో ఆకట్టుకునే యేషా సాగర్ బాలీవుడ్ లో అడుగుపెట్టే దిశగా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.

courtesy : instagram
