యుక్తీ తరేజా న్యూ మూవీ కె ర్యాంప్
తెలుగు, కన్నడ, మలయాళం సినిమాలు చేస్తూ బిజీగా ఉంది

ఉత్తరాది ముద్దుగుమ్మ యుక్తి తరేజా దక్షిణాదిలో ఆకట్టుకుంటోంది. తెలుగు, కన్నడ, మలయాళం సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అందాల యుక్తి తరేజా సోషల్ మీడియాలో పోస్టు చేసే ఫోటోలను అభిమానులు ఆస్వాదిస్తున్నారు
హర్యానాలోని కర్నాల్ పట్టణంలో 2000ల సంవత్సరంలో యుక్తి తరేజా జన్మించింది.
ఢిల్లీలో కామర్స్ డిగ్రీ చేస్తుండగానే మోడలింగ్ మొదలుపెట్టిన జిరాఫీ కాళ్ల సొగసరి చదువుకు గుడ్ బై చెప్పింది.
2021లో ఇమ్రాన్ హష్మీతో కలిసి చేసిన లుట్ గయే మ్యూజిక్ అల్బమ్ తో పాపులర్ అయింది
ఇమ్రాన్ హష్మితో మ్యూజిక్ వీడియో చేస్తే హిందీ అవకాశాలు రాకపోగా దక్షిణాదిలో వరుసగా అవకాశాలు వస్తున్నాయి
2023లో నాగ శౌర్యతో కలిసి రంగ్ బలి మూవీతో తెలుగు సినిమాకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మార్కో సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది.
ప్రస్తుతం హిందీలో హై జునూన్ డ్రీమ్ డేర్ డామినేట్ వెబ్ సీరీస్ చేస్తోంది
కిరణ్ అబ్బవరం హీరోగా చేస్తున్న ‘K-ర్యాంప్’ మూవీలో యుక్తి తరేజా హీరోయిన్‌గా చేస్తోంది
దక్షిణాదిలో పాపులారిటీ వచ్చినా ఏదో వెలితిగా ఫీల్ అవుతున్న ఈ సొగసరి బాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు యత్నిస్తోంది
courtesy : instagram
