అందచందాలతో ఏ పాత్ర ఇచ్చినా పూజా బెనర్జీ అదరగొట్టింది.

బెంగాలి హీరోయిన్ పూజా బెనర్జీ. హిందీలో సినిమాలు, సీరియళ్లు చేసిన పూజా...తన అందచందాలతో ఏ పాత్ర ఇచ్చినా తన ఫర్ పర్మెన్స్ తో అదరగొట్టింది. కుంకుమ్ భాగ్య సీరియల్ ఫేమ్ పూజా బెనర్జీ... సొగసరి ఫోటోలతో అభిమానులను కలవరపరుస్తోంది.


పూజ బెనర్జీ 1987, ఫిబ్రవరి 6న కలకత్తాలో జన్మించింది.


డిగ్రీ పూర్తి చేసిన పూజా బెనర్జీ మోడలింగ్ చేస్తూ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది.


2003లో ఎస్కేప్ ఫ్రమ్ తాలిబాన్ సినిమాలో చిన్న పాత్ర ద్వారా వెండితెరపై మెరిసింది.


కహాని హమారి మహాభారత్ కి ఆధ్యాత్మిక సీరియల్ ద్వారా పాపులర్ అయిన పూజా... ఆతర్వాత తుజే సంగ్ ప్రీత్ లగాయి సజ్నా సీరియల్లో రోమాంటిక్ పాత్ర పోషించింది


సినిమాల్లో పూర్తి స్థాయి హీరోయిన్ పాత్ర (2011) వీడు తేడా తెలుగు మూవీలో ఈ ముద్దుగుమ్మకు దక్కింది.


ఝలక్ దిఖ్లా జా 7 కార్యక్రమంలో పాల్గొన్న పూజా... రజిత్ దేవ్, వైభవి మర్చంట్‌కి చీఫ్ కొరియోగ్రాఫర్ కూడా పనిచేసింది.


2015 నుండి 2017 వరకు ప్రసారమైన కామెడీ నైట్స్ బచావో సీరియల్లో నటించిన పూజా... బుల్లితెరపై సుస్థిర స్థానం దక్కించుకుంది.


2017లో ఆశిష్ చౌదరి, సుమోనా చక్రవర్తి నటించిన దేవ్‌ సీరియల్ లో మహేక్‌ పాత్రలో నటించింది.


సహా నటుడు కునాల్ వర్మను పెళ్లి చేసుకున్న పూజా ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లి కాగా సినిమాలు, వెబ్ సీరీసులతో బిజీగా ఉంది.


నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్నా ఏ మాత్రం గ్లామర్ తగ్గని పూజా...తగిన పాత్రలు వస్తే సినిమాల్లో సత్తా చూపెడుతానంటోంది.




courtesy:instagram







Politent News Web3

Politent News Web3

Next Story