రియా సోదరి, తల్లి, అమ్మమ్మ కూడా ప్రముఖ నటీమణులు

బాలీవుడ్‌ బ్యూటీగా పేరున్న రియా సేన్ హిందీతో పాటు బెంగాలీ, తమిళ చిత్రాలలో నటించింది. ప్రముఖ నటి రైమా సేన్... రియా సోదరి కాగా తల్లి మున్ మున్ సేన్, అమ్మమ్మ సుచిత్ర సేన్ కూడా వెండితెరపై వెలిగిన వారే కావడంతో చిన్నతనంలోనే నటన ప్రారంభించింది.


రియా సేన్ అసలు పేరు రియా దేవ్ వర్మ. ఆమె 1981 లో జన్మించింది.


తండ్రి భరత్ దేవ్ వర్మ త్రిపుర రాజకుటుంబానికి చెందినవారు కాగా తల్లి ప్రముఖ నటి మున్ మున్ సేన్


ఫిలాసఫీలో డిగ్రీ చేసిన రియా...ముంబైలో ఫ్యాషన్ డిజైనింగ్ లో తర్ఫీదు పొందింది.


1991లో విష్ కన్య చిత్రంలో బాలనటిగా రియా సేన్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.


రియా సేన్ 16 ఏళ్ల వయసులో... 1998లో వచ్చిన ఫల్గుణి పాఠక్ మ్యూజిక్ వీడియో యాద్‌ పియాకి ఆనే లగితో మంచి సక్సెస్‌ అందుకుంది.


అప్పటి నుంచి ఆమె మ్యూజిక్ వీడియోలు, టెలివిజన్ వాణిజ్య ప్రకటనలు, ఫ్యాషన్ షోలతో బిజీ అయింది.


2001లో ఎన్. చంద్ర దర్శకత్వంలో వచ్చిన హిందీ చిత్రం స్టైల్‌తో కమర్షియల్ గా రియాకు హిట్ టాక్ వచ్చింది.


మ్యూజిక్ వీడియోలు, టెలివిజన్ వాణిజ్య ప్రకటనలు, ఫ్యాషన్ షోలతో బిజీగా ఉండే నిషా కళ్ల రియా... మ్యాగజైన్ కవర్లపై కనువిందుచేసింది.


2008లో మంచు మనోజ్ తో కలిసి నేను మీకు తెలుసా అనే తెలుగు సినిమాలో మెరిసిన రియా తిరిగి టాలీవుడ్ వైపు చూడలేదు.



courtesy:instagram










Politent News Web3

Politent News Web3

Next Story