bollywood heroine amyra dastur latest photo shoot

బాలీవుడ్ హీరోయిన్ అమైరా దస్తూర్ హిందీతో పాటు తమిళం, తెలుగు భాషా సినిమాల్లో నటించింది. పార్శీ సొగసరి అమైరా లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


1993లో జన్మించిన అమైరా విద్యాబ్యాసం ముంబైలో సాగింది. దస్తూర్ కామర్స్ లో డిగ్రీ చేసింది.


ఈ చిన్నది మోడల్ గా కెరీర్ ప్రారంభించి 2013లో హిందీ సినిమా ఇసాక్ ద్వారా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది.


ధనుష్ హీరోగా నటించిన 'అనేగన్(2015)' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ...సుదీర్ఘమైన విరామం తర్వాత 2023లో భగీర సినిమాలో నటించింది.


అమైరా చేసినవి కొన్ని సినిమాలే అయినా, తన అందాల ఆరబోతకు భలే క్రేజ్ ఉంది.


ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే అందాల విందుకు ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు.


అమైరా మొదటి అంతర్జాతీయ ప్రాజెక్టు కుంగ్ ఫూ యోగా సినిమాలో జాకీ చాన్‌తో జత కట్టింది.


2017లో భారతదేశంలో విడుదలైన ఈ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది.


అమైరా దస్తూర్ 2018లో విడుదలైన మనసుకు నచ్చింది సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత రాజుగాడు సినిమాలో రాజ్ తరుణ్ సరసన నటించింది.


2021లో అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన తాండవ్ సీరీస్ లో అమైరా తన నటనతో మెప్పించింది.


అయితే దశాబ్ద కాలం దాటినా ఈ అందాల భామకు సరైన హిట్టు దొరకలేదు. హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది.


మూడు పదుల వయసు దాటినా..ఇనుమడించే అందంతో ఆకట్టుకుంటున్న అమైరా..వయస్సు శరీరానికేనని, మనసుకు కాదని చెప్పే ప్రయత్నం చేస్తోంది.


దక్షిణాదితో పోలిస్తే బాలీవుడ్ లో కొంత బిజీగానే ఉన్న అమైరా...తనకంటూ ఓ ఇమేజీ సృష్టించుకోలేకపోయింది.



courtesy : instagram













Politent News Web3

Politent News Web3

Next Story