తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అగ్రహీరోలతో జతకట్టింది

రాశీఖన్నా దక్షిణాదిలో పాపులర్. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అగ్రహీరోలతో జతకట్టిన రాశీ మొదట హిందీలో నటించింది. దక్షిణాదిలో ఆకట్టుకున్న రాశీఖన్నా తాజాగా బాలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
1990లో రాశీఖన్నా ఢిల్లీలో జన్మించింది
విద్యాబ్యాసం ఢిల్లీలోనే సాగింది. ప్రఖ్యాత లేడీ శ్రీరామ్ కళాశాలలో ఆర్ట్స్ లో డిగ్రీ చేసింది.
చదువుల్లో రాణించిన రాశీ ఐఎఎస్ కావాలనుకున్నది... అనూహ్యంగా సినీ రంగంలోకి ప్రవేశించింది.
2013లో మద్రాస్ కేఫ్ సినిమా ద్వారా రాశీ వెండితెరకు పరిచయం అయింది.
2014లో మనం సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
ఇక అక్కడి నుంచి తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది. అడపాదడపా తమిళంలో కూడా అలరిస్తోంది.
రుద్ర, ఫర్జీ తదితర వెబ్ సీరీసుల్లో నటించి రాశీ మెప్పించింది.
యోధా, ది సబర్మతి రిపోర్ట్ సినిమాలతో వరుసగా హిట్స్ అందుకుంది.
ప్రస్తుతం తెలుగులో సిద్దూ జొన్నలగడ్డ సరసన తెలుసు కదా, పవన్ కళ్యాన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తోంది.
ప్రస్తుతం బాలీవుడ్ లో తలాఖోం మే ఏక్, బ్రిడ్స్ సినిమాలు చేస్తున్న రాశీ... గ్లామర్ ఫోటోలకు ఫోజులిస్తోంది.
courtesy : instagram
