Mithali Raj: 2017 వరల్డ్ కప్ విమెన్స్ క్రికెట్ ను మార్చేసింది: మిథాలీ రాజ్
విమెన్స్ క్రికెట్ ను మార్చేసింది: మిథాలీ రాజ్

Mithali Raj: టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 గురించి కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. 12 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఈ టోర్నమెంట్ జరగడంపై ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. సోమవారం జరిగిన వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ టూర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జైషా, యువరాజ్ సింగ్, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్,హర్మన్ తో పాటు పలువురు క్రికెటర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మిథాలీ భారత్లో 2013 తర్వాత మళ్లీ ఇప్పుడు మహిళల ప్రపంచ కప్ జరగడం చాలా సంతోషంగా ఉందని మిథాలీ అన్నారు. స్వదేశంలో ఈ టోర్నీ ఆడడం వల్ల భారత జట్టుకు చాలా ప్రయోజనాలు ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు.2017లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ వరకూ భారత జట్టు వెళ్లడం వల్ల మహిళల క్రికెట్‌కు భారీ గుర్తింపు లభించిందని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచే మహిళా క్రికెట్‌పై ఆదరణ పెరిగిందని, ఇప్పుడు స్వదేశంలో జరిగే ఈ టోర్నమెంట్ ద్వారా క్రికెట్‌కు మరింత మంది అభిమానులు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
గత ఏడాదిగా భారత జట్టు ప్రదర్శన చాలా మెరుగ్గా ఉందని మిథాలీ ప్రశంసించారు. ముఖ్యంగా, ఇంగ్లండ్‌ను వారి సొంత గడ్డపై ఓడించడం వల్ల జట్టు ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఇది ప్రపంచ కప్‌లో వారికి చాలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. యువరాజ్ సింగ్‌తో కలిసి ఆమె కొన్ని విషయాలను పంచుకున్నారు. ప్రపంచ కప్‌లో యువరాజ్ సింగ్ ప్రదర్శన తనని ఎంతగానో ప్రభావితం చేసిందని, ఆ విజయం తమకు స్ఫూర్తినిస్తుందని ఆమె చెప్పారు.
