మ్యాచ్ రద్దైతే రూ.2200 కోట్ల నష్టం.!

If India–Pakistan Match Is Cancelled: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించడంతో క్రికెట్ ప్రపంచంలో భారీ ప్రకంపనలు మొదలయ్యాయి.

ఈ ఒక్క మ్యాచ్ రద్దయితే ఐసీసీ , బ్రాడ్‌కాస్టర్లకు దాదాపు రూ. 2,200 కోట్ల (250 మిలియన్ డాలర్లు) పైగా నష్టం వాటిల్లుతుందని క్రీడా విశ్లేషకులు , పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ మ్యాచ్ విలువ దాదాపు $250 మిలియన్లు అని అంచనా. ఇందులో బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు.తర వాణిజ్య ఒప్పందాలు కలిసి ఉన్నాయి. ఈ మెగా మ్యాచ్ సమయంలో కేవలం 10 సెకన్ల ప్రకటన స్లాట్ ధర రూ. 40 లక్షల వరకు ఉంటుంది. మ్యాచ్ రద్దయితే బ్రాడ్‌కాస్టర్ (జియోస్టార్) దాదాపు రూ. 200 నుంచి 300 కోట్ల ప్రకటనల ఆదాయాన్ని నేరుగా కోల్పోతుంది.ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌ను బహిష్కరిస్తే పీసీబీ (PCB)కి రావాల్సిన ఐసీసీ వార్షిక వాటాలో కోత పడవచ్చు. పీసీబీ ఏడాదికి పొందే $35 మిలియన్ల ఆదాయంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే బ్రాడ్‌కాస్టర్లు భారీ మొత్తానికి (దాదాపు $3 బిలియన్లు) ఐసీసీ హక్కులను కొనుగోలు చేశారు. ఇలాంటి కీలక మ్యాచ్‌లు రద్దయితే వారు ఐసీసీతో ఒప్పందాల విలువను తగ్గించాలని (Renegotiate) ఒత్తిడి చేసే అవకాశం ఉంది.

ఎందుకీ వివాదం?

బంగ్లాదేశ్ జట్టు భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని కోరింది. ఐసీసీ దీనిని తిరస్కరించి, బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది. దీనికి నిరసనగా, బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో జరిగే మ్యాచ్‌ను ఆడబోమని పాకిస్థాన్ ప్రకటించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story