Another World Record in Cricket: 8 వికెట్లు, 7పరుగులు..క్రికెట్ లో మరో వరల్డ్ రికార్డ్
క్రికెట్ లో మరో వరల్డ్ రికార్డ్

Another World Record in Cricket: భూటాన్ యంగ్ స్పిన్నర్ సోనమ్ యేషే (Sonam Yeshey) అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక అద్భుతమైన ప్రపంచ రికార్డును సృష్టించారు. మయన్మార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఒకే ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసి క్రికెట్ చరిత్రలో నిలిచిపోయారు. 4 ఓవర్లో 8 వికెట్లు తీసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చారు.
అంతర్జాతీయ టీ20 (T20I) క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన మొదటి బౌలర్ సోనమ్ యేషే. గతంలో ఈ రికార్డు మలేషియా బౌలర్ శ్యాజ్రుల్ ఇద్రస్ (Syazrul Idrus) పేరిట ఉండేది. ఆయన 2023లో చైనాపై 8 పరుగులిచ్చి 7 వికెట్లు తీశారు.సోనమ్ ధాటికి మయన్మార్ జట్టు కేవలం 45 పరుగులకే కుప్పకూలింది. దీంతో భూటాన్ 81 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.
ఈ అద్భుతాన్ని సృష్టించిన సోనమ్ యేషే వయస్సు కేవలం 22 ఏళ్లు. ఆయన ఎడమచేతి వాటం స్పిన్నర్ (Left-arm spinner).ఈ ప్రదర్శనతో సోనమ్ యేషే రాత్రికి రాత్రే అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారారు.

