తెలివిగా తప్పించారు

AB de Villiers: రాహుల్ ద్రవిడ్ పై ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టు రాహుల్ ద్రవిడ్‌ను కెప్టెన్‌గా తొలగించిందన్నారు. ఆ తర్వాత ద్రవిడ్ భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా గొప్ప విజయం సాధించాడని అన్నారు.

రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ద్రవిడ్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించినప్పుడు అతను షాకయ్యాడని ఏబీ డివిలియర్స్ అన్నారు.. ఈ నిర్ణయం సరైనది కాదని డివిలియర్స్ అభిప్రాయపడ్డారు.

ద్రవిడ్ ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఆటగాడని, అతని నైతిక విలువలు, క్రీడా స్ఫూర్తి అద్భుతమని డివిలియర్స్ ప్రశంసించారు. కెప్టెన్సీ నుంచి తొలగించిన తర్వాత కూడా ద్రవిడ్ ఎటువంటి ఫిర్యాదులు లేకుండా, ప్రొఫెషనల్‌గా జట్టుకు తన సేవలను కొనసాగించారని అన్నారు.

ద్రవిడ్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించిన తరువాత, అతను కోచ్‌గా తన నైపుణ్యాలను నిరూపించుకున్నాడు. భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన ద్రవిడ్, జట్టును విజయపథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించారని డివిలియర్స్ తెలిపారు. రాజస్థాన్ రాయల్స్ చేసిన ఆ నిర్ణయం ఒక రకంగా భారత క్రికెట్ జట్టుకు మంచి చేసిందని డివిలియర్స్ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 6, 2024న ద్రవిడ్ తో రాజస్థాన్ రాయల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్క సీజన్ కే ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ కు గుడ్ బై చెప్పారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story