రిటైర్మెంట్ ఇచ్చినా పవర్ తగ్గలేదు..

AB de Villiers’ Stunning Century: ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 ఫైనల్‌లో ఏబీ డివిలియర్స్ అద్భుతమైన సెంచరీతో సౌతాఫ్రికా చాంపియన్స్ జట్టుకు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో డివిలియర్స్ కేవలం 60 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 120 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ టోర్నమెంట్‌లో ఇది ఆయనకు మూడవ సెంచరీ.

హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో బాధపడుతున్నప్పటికీ, డివిలియర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును గెలిపించారు.ఈ సెంచరీతో ఆయన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మరియు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులను కూడా గెలుచుకున్నారు. ఆయన కేవలం 47 బంతుల్లోనే సెంచరీ మార్క్ చేరుకోవడం విశేషం. పాకిస్తాన్ చాంపియన్స్ జట్టు నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా చాంపియన్స్ కేవలం 16.5 ఓవర్లలోనే ఛేదించింది.

2004లో అరంగేట్రం చేసి 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే క్రికెట్‌లో వేగవంతమైన 50 (16 బంతుల్లో), వేగవంతమైన 100 (31 బంతుల్లో), వేగవంతమైన 150 (64 బంతుల్లో) పరుగులు చేసిన రికార్డులు అతని పేరిట ఉన్నాయి.

ఐపీఎల్‌లో చాలా కాలం పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. అంతకుముందు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరపున కూడా ఆడాడు. ICC ODI ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా మూడుసార్లు (2010, 2014, 2015) ఎంపికయ్యారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story