అభిషేక్ శర్మ

Abhishek Sharma: అభిషేక్ శర్మ ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అతను ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్‌ను అధిగమించి ఈ స్థానాన్ని సాధించాడు. ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయ క్రికెటర్‌గా అభిషేక్ రికార్డు సృష్టించాడు. అతని కంటే ముందు విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ ఈ స్థానాన్ని పొందారు.అభిషేక్ శర్మ ప్రస్తుతం 829 రేటింగ్ పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ట్రావిస్ హెడ్ 814 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు.

జడేజా టెస్ట్ ఆల్-రౌండర్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో అతని అద్భుతమైన ప్రదర్శన అతని రేటింగ్ పాయింట్‌లను పెంచాయి. ప్రస్తుతం, అతను 422 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ ఆటగాడు మెహిదీ హసన్ మిరాజ్ కంటే 117 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. బ్యాటింగ్‌లో కూడా జడేజా ఐదు స్థానాలు ఎగబాకి 29వ స్థానానికి చేరుకున్నాడు. బౌలింగ్‌లో ఒక స్థానం పైకి ఎగబాకి 14వ స్థానంలో ఉన్నాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story