Abhishek Sharma: హైదరాబాద్‌ ఇప్పుడు ఐపీఎల్ ఫీవర్‌తో ఊగిపోతోంది. రేపు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ , కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు ఆరెంజ్ ఆర్మీ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఆధ్యాత్మిక బాట పట్టారు. నగరంలోని ప్రముఖ కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయాన్ని సందర్శించిన అభిషేక్, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మైదానంలో పరుగుల సునామీ సృష్టించే ఈ యువ సంచలనం, రేపటి మ్యాచ్‌లో జట్టు విజయం సాధించాలని ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.

"హైదరాబాద్‌తో అభిషేక్ శర్మకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. గతంలోనే ఆయన బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయాలను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. భాగ్యనగర సంస్కృతిని గౌరవిస్తూ, ఇక్కడి అమ్మవార్ల ఆశీస్సులతో ఈ సీజన్‌లో ఇప్పటికే సెంచరీతో విరుచుకుపడుతున్నారు.

ఇక రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ఉప్పల్ స్టేడియం వేదికగా కేకేఆర్‌తో పోరు జరగనుంది. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్, సొంత గడ్డపై మరోసారి సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. అభిషేక్ శర్మ బ్యాట్ నుంచి మళ్ళీ సిక్సర్ల వర్షం కురుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story