ఆఫ్ఘనిస్తాన్ శుభారంభం

Asia Cup 2025: ఆసియా కప్ 2025లో ఆఫ్ఘనిస్తాన్ తమ ప్రయాణాన్ని అద్భుతమైన విజయంతో ప్రారంభించింది. హాంకాంగ్‌పై 94 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, హాంకాంగ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 94 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు విఫలమైనప్పటికీ, సెదికుల్లా అటల్ (73 నాటౌట్) మరియు అజ్మతుల్లా ఒమర్ జాయ్ (53) అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును గెలుపు బాట పట్టించారు. ఒమర్ జాయ్ కేవలం 20 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకుని, ఆఫ్ఘనిస్తాన్ తరపున T20Iలో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును నెలకొల్పాడు. సెదికుల్లా అటల్, ఒమర్ జాయ్ కలిసి 35 బంతుల్లో 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి, హాంకాంగ్ బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేశారు. ఫజల్హాక్ ఫారూఖీ, గుల్బాదిన్ నైబ్ చెరో 2 వికెట్లు తీసి హాంకాంగ్ జట్టును దెబ్బతీశారు. ఒమర్ జాయ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ కూడా తలో వికెట్ తీశారు. ఈ విజయం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ ఆసియా కప్‌లో శుభారంభం చేసి, గ్రూప్ బీలో శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పోటీపడనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story