ఎయిర్ ఇండియా క్షమాపణలు!

Mohammed Siraj: భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే, ఆ విమానయాన సంస్థ స్పందించింది.

గువాహటి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (ఫ్లైట్ నం. IX 2884) విమానం సుమారు నాలుగు గంటలకు పైగా ఆలస్యమవడంతో సిరాజ్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. దీనిపై ఆయన 'X' (ట్విట్టర్) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేయగా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ యాజమాన్యం తక్షణం స్పందించింది.

ఊహించని సాంకేతిక,నిర్వహణ కారణాల వల్ల ఈ విమానాన్ని రద్దు చేయవలసి వచ్చిందని" ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సిరాజ్‌కు, ఇతర ప్రయాణికులకు క్షమాపణలు చెబుతూ అధికారికంగా బదులిచ్చింది. సరైన సమాచారం అందించడంలో జరిగిన ఆలస్యానికి,మీకు కలిగిన తీవ్ర అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము," అని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

రద్దైన విమానంలోని ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు విమానయాన సంస్థ హామీ ఇచ్చింది. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడానికి, వారికి వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది.క్రికెటర్ మహ్మద్ సిరాజ్ వంటి సెలబ్రిటీ ప్రయాణికుడు ఫిర్యాదు చేయడంతో, ఈ అంశం త్వరగా వెలుగులోకి వచ్చి, విమానయాన సంస్థ వెంటనే స్పందించడానికి దారితీసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story