French Open: అల్కరాజ్ దే.. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్
ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్

French Open: స్పెయిన్ సూపర్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించాడు. ఆదివారం మొత్తం 5 గంటల 29 నిమిషాలపాటు సాగిన ఫైనల్లో రెండోసీడ్ అల్కరాజ్ 4–6, 6–7 (4/7), 6–4, 7–6 (7/3), 7–6 (10/2)తో వరల్డ్ నంబర్‌వన్ టాప్ సీడ్ యానిక్ సినర్ (ఇటలీ)కు ఊహించని షాకిచ్చాడు.
టైటిల్ ఫైట్‌లో బలమైన గ్రౌండ్ స్ట్రోక్స్, అద్భుతమైన సర్వీస్‌లు, బేస్‌లైన్ గేమ్‌తో చెలరేగిన సినర్ తొలి రెండు సెట్లలో నెగ్గినా.. తర్వాతి మూడు సెట్లలో అల్కరాజ్ దాటిని తట్టుకోలేకపోయాడు. నాలుగో సెట్ లో 3–5 (0–40)తో వెనుకబడ్డ దశలో వరుసగా మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకున్న అల్కరాజ్ అద్భుత విజయం సాధించాడు.
టోర్నీ మొత్తం ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్ చేరిన సినర్ టైటిల్ ఫైట్‌లో మాత్రం కీలక టైమ్‌లో అల్కరాజ్ సర్వీస్‌లను తీయలేకపోయాడు. దాంతో గ్రాండ్‌స్లామ్స్‌లో వరుస విజయాల సంఖ్య 20తోనే ఆగిపోయింది. తుదిపోరులో సినర్ 8 ఏస్‌లు, 53 విన్నర్లు కొట్టి బ్రేక్ 7 పాయింట్లు సాధించాడు.
