సచిన్-ద్రవిడ్ రికార్డ్‌ బ్రేక్..!

Ro-Ko Duo: స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో 25 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా, నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌పై దృష్టి పెట్టింది. టెస్టు ఓటమి బాధ నుంచి బయటపడాలంటే వన్డే సిరీస్‌ గెలవాల్సిన అవసరం ఉంది. రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రావడంతో భారత వన్డే జట్టు బలంగా కనిపిస్తోంది.

సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలు

ఈ వన్డే సిరీస్‌లో ముఖ్యంగా రాంచీ వన్డేతో రోహిత్-కోహ్లీ జోడీ ఓ అరుదైన, గొప్ప మైలురాయిని చేరుకోబోతోంది. సచిన్ టెండూల్కర్ - రాహుల్ ద్రవిడ్ జోడీ కలిసి సరిగ్గా 391 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఇప్పటి వరకు టీమ్‌ఇండియా తరఫున 391 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో జోడీగా ఆడారు. రాంచీ వన్డేలో రో-కో క్రీజులో నిలబడితే వారిద్దరూ కలిసి ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌ల సంఖ్య 392 అవుతుంది. తద్వారా భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన జోడీగా వీరు సచిన్-ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టనున్నారు.

రోహిత్ శర్మ - విరాట్ కోహ్లీ - 391

సచిన్ టెండూల్కర్ - రాహుల్ ద్రవిడ్ - 391

రాహుల్ ద్రవిడ్ - సౌరవ్ గంగూలీ - 369

సచిన్ టెండూల్కర్ - సౌరవ్ గంగూలీ - 341

విరాట్ కోహ్లీ - రవీంద్ర జడేజా - 309

వన్డేల్లో భారత్ Vs సౌతాఫ్రికా రికార్డు

వన్డే ఫార్మాట్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటి వరకు జరిగిన ముఖాముఖి పోరు రికార్డును పరిశీలిస్తే, సఫారీలు కాస్త పైచేయి సాధించారు.

మొత్తం మ్యాచ్‌లు: 94 (1991 నుంచి)

భారత్ గెలుపు: 40

దక్షిణాఫ్రికా గెలుపు: 51

భారత్ స్వదేశంలో 18 మ్యాచ్‌లు గెలిస్తే, దక్షిణాఫ్రికా వారి స్వదేశంలో 26 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. టెస్టు సిరీస్ పరాజయాన్ని పక్కన పెట్టి, వన్డే సిరీస్‌ను గెలవాలని రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్‌ఇండియా పట్టుదలతో ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story