All-rounder Saransh Jain: ఈ రోజుల్లో చాలామంది క్రికెటర్లు ఐపీఎల్‌లో మెరిసి భారత జట్టులోకి వస్తున్నారు. కానీ, ఎలాంటి ఐపీఎల్ హైప్ లేకుండా.. కేవలం పదేళ్లకు పైగా దేశవాళీ క్రికెట్‌లో అంకితభావంతో రాణించి టీమిండియా పిలుపు అందుకున్నాడు ఒక యోధుడు. అతడే మధ్యప్రదేశ్‌కు చెందిన 33 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్, ఆల్ రౌండర్ సరాంశ్ జైన్.

గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆగస్టులో శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు సరాంశ్ ఎంపికయ్యాడు. ఇటీవల ఇండియా 'ఏ' తరపున శ్రీలంకలో జరిగిన రెండో అనధికారిక టెస్టులో సరాంశ్ అద్భుత ప్రదర్శన చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆరు వికెట్లు తీయడమే కాకుండా, తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 70 పరుగులు చేసి తన ఆల్ రౌండ్ ప్రతిభను చాటుకున్నాడు.

ఈ 11 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం వెనుక ఎన్నో కష్టాలు, త్యాగాలు ఉన్నాయి. 2014లో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు తన తండ్రికి క్యాన్సర్ సోకిన విషయం సరాంశ్ కుటుంబ సభ్యులు అతనికి చెప్పలేదు. ఆటపై అతని ఏకాగ్రత దెబ్బతినకూడదని ఆ శస్త్రచికిత్స విషయాన్ని దాచిపెట్టారు. స్వదేశానికి వచ్చాక అసలు నిజం తెలుసుకున్న సరాంశ్ చలించిపోయినా, కుటుంబం అందించిన ధైర్యంతోనే ఇవాళ ఈ స్థాయికి చేరుకున్నాడు.

కష్టాలను ఓడించి, దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనతో సెలక్టర్ల మనసు గెలుచుకున్న సరాంశ్ జైన్ సక్సెస్ స్టోరీ ప్రతి క్రికెటర్కు ఒక పెద్ద ఇన్స్పిరేషన్.

PolitEnt Media

PolitEnt Media

Next Story